Dailyhunt
PBKS చేతిలో SRH చిత్తు

PBKS చేతిలో SRH చిత్తు

వార్త 1 week ago

పీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై పంజాబ్ కింగ్స్ (PBKS) ఘనవిజయం సాధించింది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది.

ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ప్రస్తుత సీజన్‌లో తమ మూడో విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు చూపిన తెగువ అభిమానులను అలరించింది.

Read Also : Guntur School Bus Accident: స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి!

చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ధీటుగా ఎదుర్కొంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. అయ్యర్ 69 పరుగులతో అజేయంగా నిలవగా, అతనికి తోడుగా ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (57), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (51) మెరుపు అర్ధశతకాలతో పునాది వేశారు. పంజాబ్ బ్యాటర్లు కేవలం 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటారు.

అభిషేక్ మెరుపులు వృథా.. అర్ష్‌దీప్ కట్టుదిట్టమైన బౌలింగ్

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 74 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి తొలి వికెట్‌కు కేవలం 50 బంతుల్లోనే 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, పంజాబ్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్ చెరో రెండు వికెట్లతో కీలక సమయంలో వికెట్లు పడగొట్టి హైదరాబాద్ స్కోరును కట్టడి చేశారు. ఓపెనర్లు భారీ స్కోరు చేసినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడటంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

విజయవాడ-హైదరాబాద్ ప్రయాణం ఇక 2 గంటలే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha