Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయవాడ-హైదరాబాద్ ప్రయాణం ఇక 2 గంటలే!

విజయవాడ-హైదరాబాద్ ప్రయాణం ఇక 2 గంటలే!

వార్త 2 months ago

High Speed Trains: భారతీయ రైల్వేను అంతర్జాతీయ సెమీ-హై-స్పీడ్ ప్రమాణాలకు చేరువ చేసేందుకు 2027-28 కోచ్ ఉత్పత్తి ప్రణాళికలో భాగంగా రెండు కొత్త రైలు సెట్లను తయారు చేయాలని నిర్ణయించారు.

ఇవి గంటకు 220 కిలోమీటర్ల డిజైన్ వేగంతో ప్రయాణించేలా రూపొందించబడతాయి. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగవంతమైన వందే భారత్ గరిష్ట వేగం 180 కిమీ కాగా, కొత్త రైళ్లు గంటకు 200 కిమీ నిర్వహణ వేగంతో పట్టాలపై పరుగులు తీయనున్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనుంది.

Read Also:Vijay Sai Reddy: మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి!

 Bullet-style trains set to hit the tracks by 2027-Good news for the residents of Vijayawada.

అత్యాధునిక సౌకర్యాలు.. విలాసవంతమైన ప్రయాణం

ఈ కొత్త హై-స్పీడ్ రైళ్లలో కేవలం వేగం మాత్రమే కాకుండా ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అధిక వేగాన్ని తట్టుకునేలా వీటిని ప్రత్యేకమైన స్టీల్ బాడీతో నిర్మిస్తున్నారు. ఈ రైళ్లలో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి, అన్నీ ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ విభాగాలే. ప్రయాణికులకు విమాన తరహా అనుభూతిని అందించేలా రిక్లైనింగ్ సీట్లు, అధునాతన ఆన్‌బోర్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి వసతులను కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఐసిఎఫ్ మరియు బిఈఎంఎల్ (BEML) మధ్య ఇప్పటికే 866.87 కోట్ల రూపాయల ఒప్పందం కుదిరింది.

High Speed Trains: విజయవాడ – హైదరాబాద్ ప్రయాణం ఇక చిటికెలో..

ఒకవేళ ఈ 220 కిమీ వేగంతో ప్రయాణించే రైలు అందుబాటులోకి వస్తే, తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం విప్లవాత్మకంగా తగ్గనుంది.

  • ప్రస్తుత సమయం: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుండి సికింద్రాబాద్ చేరుకోవడానికి సుమారు 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల సమయం తీసుకుంటోంది.
  • కొత్త రైలు వేగం: ట్రాక్ నాణ్యత మెరుగుపడి, ఈ రైలు 200 కిమీ వేగంతో ప్రయాణిస్తే, విజయవాడ-హైదరాబాద్ దూరాన్ని కేవలం 90 నిమిషాల నుండి 2 గంటల్లోనే పూర్తి చేయవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, రెండు నగరాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. పట్టాల ఆధునీకరణ పనులు పూర్తయితే 2027-28 నాటికి ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఏపీలో కొత్త పథకం: విద్యార్థుల ఇంటికే డ్రై రేషన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha