Poverty : సార్వత్రిక ప్రాప్యత, బలహీన వర్గాల ఉత్పాదక వృద్ధిని ప్రాథ మిక సామాజిక భద్రతకు సూచికగా చెప్పవచ్చు. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర పథకాలు, చట్టబద్ధమైన నిబంధనలు, సంక్షేమ కార్యక్రమాల మిశ్ర మంగా సామాజిక రక్షణ పనిచేస్తుం ది.
ఆర్థిక అంతరాలు లేకుండా సామా జిక రక్షణలో సామాజిక భద్రత, పెన్ష న్లు, ఆరోగ్య బీమా, నిరుద్యోగ ప్రయో జనాలు, వైకల్య మద్దతు, ప్రసూతి ప్రయోజనాలను కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు అందించాలి. ఐక్య రాజ్యసమితి ఆమోదించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పేదరిక నిర్ములనలో అందరికి సామాజిక రక్షణ కల్పించాలి. సామాజిక రక్షణ వ్యవస్థలు, చర్యలను అమలు చేయాలని అన్ని సభ్య దేశాలకు 2015లో ఐక్యరాజ్యసమితి పిలుపు నిచ్చింది. ఆదాయ మద్దతు కార్యక్రమాలు చేపట్టి దుర్బల త్వం, అసమానత, పేదరికాన్ని 2030 నాటికీ తగ్గించాలి. వ్యక్తులు, కుటుంబాల జీవిత చక్రంలో పేదరికం, దుర్బల త్వం, అభద్రతను తగ్గించడానికి సామాజిక రక్షణవిధానాలు, కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపడుతాయి.
Read Also : Raghav Chadha: పదవి పోయిన కొద్దిరోజులకే రాఘవ్ చద్దాకు భద్రత తొలగింపు!
Poverty
Poverty : ఆర్థిక రుణభారాలు
ఆదాయభద్రత, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి మద్దతు, వృద్ధాప్య పెన్షన్లు, వైకల్య ప్రయోజనాలు, ఆర్థిక రుణభారాల నుండి ప్రజలను రక్షించే, వారి శ్రేయస్సుకు మద్దతుగా సామజిక రక్షణ అవసరం. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎసిజి), అంతర్జాతీయ కార్మిక సంస్థ సిఫార్సులకు అనుగుణంగా సామాజిక రక్షణ విధానాలను సభ్య దేశాలు అవలంబిస్తా యి. గడిచిన దశాబ్దంలో భారతదేశం సామాజిక రక్షణ కవరేజీలో గణనీయమైన విస్తరణను నమోదు చేసింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ గుర్తించిన అధికారిక డేటా ప్రకారం భారతదేశంలో సామాజిక రక్షణ కవరేజ్ 2015లో జనాభాలో దాదాపు 19 శాతం ఉంది. అది 2025లో 64.3 శాతానికి పెరిగింది. దీని ఫలితంగా 2025నాటికి 94కోట్ల మంది ప్రజలు చట్టబద్ధంగా కనీసం ఒక సామాజిక రక్షణ ప్రయోజనాన్ని పొందుతున్నారు. పదేళ్లలో కవరేజ్లో ఈ 45 శాతం పాయింట్ల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన విస్తరణలలో ఒకటిగా పరిగణించవ చ్చు. లబ్ధిదారుల సంఖ్య పరంగా ప్రపంచంలో రెండవస్థానం లో భారతదేశం ఉంది. ఆదాయ స్థాయిలు, అధికారిక, అనధికారిక రంగాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పౌరులకు నగదు, వస్తువు ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం చేసిన సమిష్టి ప్రయత్నాన్ని ఈ విస్తరణ ప్రతిబింబిస్తుంది.
ఆర్థిక భద్రత
ఆధార్ ఆధారిత గుర్తింపును ఉపయోగించి అంతర్జాతీయ కార్మిక సంస్థ సహకారంతో జాతీయ సామాజిక రక్షణ డేటా విశ్లేషణ నిర్వహించారు. 34 ప్రధాన కేంద్ర పథకాల రికార్డు లను సమగ్రపరచి వివరాలను వెల్లడించారు. ఈ విశ్లేషణ ప్రకారం 2024 నాటికి జనాభాలో దాదాపు 65 శాతం అంటే దాదాపు 92కోట్ల మంది ప్రజలు కనీసం ఒక సామా జిక రక్షణ ప్రయోజనం కిందకు వచ్చారు. ఆహారం, గృహ సహాయం వంటి నగదు, వస్తుపరమైన ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు,కవరేజ్ 2021లో దాదాపు 24.4 శాతం ఉండగా 2024లో 48.8 శాతానికి రెట్టింపు అయింది. భారతదేశంలో బహుళ జనాభా, సామాజిక ఆర్థిక సమూహాలను లక్ష్యంగా సామాజిక రక్షణ నిర్మాణం చేపట్టా రు. అనేక ప్రధాన పథకాలను ప్రభుత్వాలు అందిస్తున్నా యి. అతి తక్కువ ప్రీమియంతో పెన్షన్, బీమా చొరవలలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన’ ప్రమాద బీమాను అందిస్తోంది. 2025 మధ్యనాటికి 51 కోట్లకు పైగా నమోద య్యారు. ‘ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’, జీవిత బీమా పథకం, దాదాపు 23.64 కోట్ల వ్యక్తులను కవర్ చేస్తుంది. ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ అనధికారిక కార్మికులను లక్ష్యంగా చేసుకుని పెన్షన్ పథకం, అసంఘటిత రంగ కార్మికులకు ‘అటల్ పెన్షన్ యోజన’ ఆర్థిక భద్రతను అందిస్తోంది. లక్షలాది మంది చందాదారు లను, గణనీయమైన పెన్షన్ కార్పస్ సేకరణలను కలిగి ఉంది. ఆర్థిక బీమాతో పాటు, భారతదేశంలో సామాజిక రక్షణ ఉపాధి, జీవనోపాధి మద్దతు లభిస్తోంది.
Poverty
స్వల్పకాలిక ఉపశమనం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద గ్రామీణ కుటుంబాలకు ఏడా దికి కనీసం 125 రోజుల వేతన ఉపాధిని అందిస్తోంది. ‘ఇశ్రమ్ పోర్టల్లో 30 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు చేరారు. ఇది వివిధ సంక్షేమ పథకాలను ఏకీకృతం చేస్తోం సామాజిక రక్షణలో ‘ప్రజా పంపిణీ వ్యవస్థ’, ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ వంటి విస్తృత సంక్షే మ జోక్యాలు కూడా ఉన్నాయి. ఈ పథకాల ద్వారా లక్షలాది మందికి సబ్సిడీ లేదా ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తున్నారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన వంటి చొరవలతో ఆరోగ్య భద్రత బలోపేతం అవుతుంది. ఇది అర్హత కలిగిన కుటుంబాలకు గణనీ యమైన ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మెరుగుపరుస్తుంది. భారతదేశంలో బహుళకోణ పేదరికం, దుర్బలత్వాన్ని తగ్గించడంలో సామాజిక రక్షణ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత దశాబ్దంలో పది లక్షలమంది ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వివిధ అంచనాల ప్రకారం దాదాపు 24.8 కోట్ల మంది వ్యక్తులు పేదరికం నుంచి బయటపడ్డారు. భారతదేశంలోకొన్ని క్లిష్టమైన సవాళ్లు మిగిలి ఉన్నాయి. అనధికారిక కార్మికులు, పట్టణ పేదలు, వలసదారులు, మహిళలలో సామజిక రక్షణ కవరేజ్ అంతరాలు కొనసాగుతున్నాయి. వీరిలో చాలా మందికి పోర్టబిలిటీ, ప్రయోజనాల గురించి అవగాహన లేదు. ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే భారతదేశంలో సామా జిక రక్షణ వ్యయం చాలా తక్కువగా ఉంది. ప్రయోజనాల సమర్ధతను పరిమితం చేస్తుంది. ప్రభుత్వాలు దీర్ఘకాలిక సామాజిక భద్రత కంటే స్వల్పకాలిక ఉపశమనంపై తర చుగా దృష్టి సారిస్తున్నాయి. సామాజిక రక్షణపై పూర్తిగా సాకారం చేసుకోవడానికి, భారతదేశం సమానత్వం, సమర్ధత, స్థిరత్వాన్ని నిర్ధారించే సార్వత్రిక, హక్కుల ఆధారిత, సమగ్ర వ్యవస్థల వైపు పయనించాలి.
-డా. సునీల్ కుమార్ పోతన
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

