Peddamma Temple: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ పెద్దమ్మ ఆలయం వద్ద తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన కారుకు పూజ చేయించేందుకు వచ్చిన కుటుంబంలో ఊహించని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
కారు పూజ పూర్తయిన కాసేపటికే వాహనం ఢీకొని 70 ఏళ్ల వృద్ధుడు రామచంద్రరావు మృతి చెందారు.
వివరాల ప్రకారం.. రామచంద్రరావు (70) తన కుమార్తె ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన మేనల్లుడు కొత్తగా కారు కొనుగోలు చేయడంతో దానికి పూజ చేయించడం కోసం కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా కారు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also : Minor Assault Case Odisha: 9వ తరగతి బాలిక గర్భవతిగా గుర్తింపు.. ట్యూటర్ అరెస్ట్
Tragedy at Peddamma Temple: Man dies after arriving for new car puja.
Peddamma Temple: యాక్సిలరేటర్ పొరపాటున నొక్కడంతో ప్రమాదం
పూజ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కారును అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి వాహనాన్ని కదిలించే క్రమంలో ప్రమాదవశాత్తు బ్రేకుకు బదులు యాక్సిలరేటర్‌పై బలంగా కాలు వేయడంతో కారు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. ఆ సమయంలో కారుకు సమీపంలోనే నిలబడి ఉన్న రామచంద్రరావును కారు బలంగా ఢీకొట్టింది.
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
ఈ ఊహించని ప్రమాదంలో రామచంద్రరావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన తెల్లవారుజామున చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొత్త కారు కొన్న ఆనందం కాసేపటికే తీరని శోకాన్ని మిగల్చడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

