Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది'. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
అయితే, సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నా చిత్ర యూనిట్ ప్రమోషన్ల విషయంలో మౌనంగా ఉండటం అభిమానుల్లో తీవ్ర అసహనానికి దారితీస్తోంది.
Read Also : Rashmika Mandanna: ఆ భయం నుంచి బయటపడ్డా.. 'మైసా' కోసం రష్మిక కష్టాలు
Ram Charan’s ‘Peddhi’ movie.. Fan’s suicide note says there are no promotions
Peddi Movie: అభిమాని ఎమోషనల్ లేఖ వైరల్
జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌కు సమయం తక్కువగా ఉన్నా, ప్రమోషన్ షెడ్యూల్ ప్రకటించకపోవడంపై ఒక అభిమాని X (ట్విట్టర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమోషనల్ లేఖ రాశారు. “గతంలో ‘గేమ్ ఛేంజర్’ సమయంలోనూ ఇలాంటి టెన్షనే పడ్డాం. ఇప్పుడు ‘పెద్ది’ విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది. వెంటనే ప్రమోషన్లు మొదలు పెట్టకపోతే నేను ఉరేసుకుంటా” అంటూ సదరు అభిమాని ఆందోళనకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మెగా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. సినిమాల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పలువురు నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
సినిమాపై భారీ అంచనాలు
వృద్ది సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చరణ్ గడ్డం, జుట్టుతో ఉన్న లుక్, అలాగే గ్లింప్స్‌లో ఆయన కొట్టిన క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘పహిల్వాన్ గ్లింప్స్’ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేసింది. అయితే విడుదల తేదీకి కేవలం కొద్ది రోజులే ఉండటంతో, త్వరలోనే భారీ ప్రమోషన్లు నిర్వహించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ నుండి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

