Peddi movie : రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా చుట్టూ ఇప్పుడు భారీ చర్చ నడుస్తోంది. ట్రైలర్ విడుదల తర్వాత వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌తో సినిమాకు మళ్లీ భారీ హైప్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
భోపాల్‌లో భారీ ఈవెంట్
భోపాల్‌లో జరగబోయే ఈ లైవ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమాలోని ప్రత్యేక పాటను లక్ష మందికి పైగా ప్రేక్షకుల సమక్షంలో విడుదల చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్స్, భారీ లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ ఒక్క ఈవెంట్‌కే దాదాపు రూ.4 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం.
'పెద్ది' ఎందుకు ఒప్పుకున్నాడు?
ఈ సినిమా గురించి మాట్లాడిన రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పెద్ది' కథ తనకు చాలా దగ్గరగా అనిపించిందని తెలిపారు. కథలోని గ్రామీణ జీవితం, మనుషుల భావోద్వేగాలు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశాయని చెప్పారు. "ఈ సినిమా నాకు నా నేల, నా సంస్కృతిని గుర్తు చేసింది" అంటూ రామ్ చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Ramani Kalyanam Movie: ఎమోషనల్ లవ్ స్టోరీ 'రమణి కళ్యాణం' మూవీ రివ్యూ
Peddi Movieగ్రామీణ పాత్రలో రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్' తర్వాత మరో స్టైలిష్ పాన్ ఇండియా సినిమా చేయకుండా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉన్న కథను ఎంచుకోవడం ప్రత్యేకంగా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ మట్టి, చెమటతో నిండిన కష్టజీవి పాత్రలో కనిపించనున్నారు. పాత్ర సహజంగా కనిపించేందుకు భాష, హావభావాలు, శరీర భాషపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

