Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు పెంపు!

పెద్ది ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు పెంపు!

వార్త 2 weeks ago

Peddi Ticket Prices : రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం 'పెద్ది' విడుదలకు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 3న నిర్వహించనున్న ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రీమియర్ ప్రదర్శనలకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అయితే ముందుగా ప్రచారం జరిగినట్లుగా పలుమార్లు షోలు కాకుండా, సాయంత్రం 8 గంటల తర్వాత ఒక ప్రత్యేక ప్రీమియర్ షో మాత్రమే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్

సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ ధరల పెంపుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. జూన్ 13 వరకు పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి లభించింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 వరకు అదనపు ధర వసూలు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో విడుదల తొలి రోజుల్లో నిర్మాతలకు, థియేటర్లకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

Read Also : Viswanand and Sons Release Date: సూర్య 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' రిలీజ్ డేట్ ఫిక్స్!

 Peddi Ticket Prices

తెలంగాణ నిర్ణయంపై ఆసక్తి

ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలో కూడా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల టికెట్ రేట్ల అంశంపై వివాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఇటీవల డబ్బింగ్ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించగా, నేరుగా విడుదలైన తెలుగు చిత్రాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో “పెద్ది” భారీ విజయాన్ని సాధించి తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha