Peddi Movie Release Date:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే వార్త . ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది' (Peddi) విడుదల తేదీ విషయంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: Kara Movie Review: ధనుష్, మమిత బైజు 'కర' సినిమా టాక్ ఎలా ఉందంటే?
ముందుగానే వస్తున్న 'పెద్ది'.. జూన్ 4న ఫిక్స్?
నిజానికి ఈ సినిమాను జూన్ 25న విడుదల చేస్తామని దర్శకుడు బుచ్చిబాబు గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' (Toxic) చిత్రం తొలుత జూన్ 4న విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల 'టాక్సిక్' సినిమా వాయిదా పడింది. దీంతో ఆ క్రేజీ డేట్‌ను క్యాష్ చేసుకోవాలని 'పెద్ది' మేకర్స్ భావిస్తున్నారు. అనుకున్న సమయం కంటే మూడు వారాల ముందుగానే, అంటే జూన్ 4న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.

Peddi Movie Release Date: శుక్రవారం అఫీషియల్ అనౌన్స్‌మెంట్?
ఈ డేట్ మార్పుపై ఇప్పటికే ఫిలిం నగర్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై ఒక స్పష్టతనిస్తూ శుక్రవారం రోజున మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ గ్లోబల్ వైడ్‌గా పెరగడంతో, ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

