Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, సినిమా ఘన విజయం సాధించాలనే గట్టి సంకల్పంతో హీరోయిన్ జాన్వీ కపూర్ కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు. సాంప్రదాయ పద్ధతిలో అలిపిరి మెట్ల మార్గం గుండా ఆమె కాలినడకన కొండపైకి చేరుకోవడం విశేషం. దారిపొడవునా ఆమెను చూసేందుకు, ఆమెతో ఫొటోలు మరియు సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు.
Read Also : అప్పుల వలయం.. 'కార్మేని సెల్వమ్' మూవీ రివ్యూ!

శ్రీవారి చెంత టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది'
దర్శకనిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాలని చిత్రబృందం భావిస్తోంది. అందులో భాగంగానే జాన్వీ కపూర్ ఇవాళ ఉదయం శ్రీవారి విఐపి విరామ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రామ్ చరణ్ సరసన నటించిన ఈ సినిమా తన కెరీర్‌కు ఎంతో ప్లస్ అవుతుందని భావిస్తున్న జాన్వీ, తిరుమలేశుని ఆశీస్సుల కోసం ఇలా కాలినడకన రావడం సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది. ఈ చిత్రం ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని అటు మెగా అభిమానులు, ఇటు చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

