Peddi Movie Ticket Rates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'.
విడుదలకు ముందే భారీ అంచనాలను నెలకొల్పుకున్న ఈ పాన్ ఇండియా మూవీకి తెలంగాణలో ఊహించని చుక్కెదురైంది. సినిమా మొదటి వారం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర ఉత్తర్వులు (ఇంటరిమ్ ఆర్డర్స్) ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
Read Also: Ram Charan - Shivanna: పెద్ది సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, శివరాజ్‌కుమార్..ఫోటో వైరల్
Telangana High Court dismisses petition seeking 'higher' ticket price hike
Peddi Movie Ticket Rates: లంచ్ మోషన్ పిటిషన్ వేసిన మైత్రీ మూవీ మేకర్స్
ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరల పెంపునకు అనుమతి కోరుతూ చిత్ర బృందం మొదట తెలంగాణ హోం సెక్రటరీకి విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన గౌరవ న్యాయస్థానం.. టికెట్ల ధరల విషయంలో ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. గతంలో ఉన్న పలు కేసులను, తీర్పులను ప్రస్తావిస్తూ తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.
సినిమా జూన్ 4న థియేటర్లలోకి వస్తుండగా, కోర్టు విచారణను జూన్ 6న జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చిత్ర నిర్మాణ సంస్థ భావించింది. మొదటి వారమే కలెక్షన్ల పరంగా కీలకమైన సమయం కావడంతో, విచారణ వాయిదా పడటంతో మైత్రీ మూవీ మేకర్స్ తరఫు న్యాయవాది తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఏపీలో ఓకే.. తెలంగాణలో పాత ధరలకే!
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్‌లో 'పెద్ది' చిత్రానికి ప్రత్యేక ప్రదర్శనలు, అలాగే టికెట్ ధరల పెంపునకు అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. కానీ, తెలంగాణలో మాత్రం పాత ధరలకే సినిమాను ప్రదర్శించాల్సి వస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు తెలంగాణలో రేట్లు పెరగకపోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో టికెట్ ధరల పెంపు ఆగిపోవడం మెగా అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, సాధారణ ధరలకే టికెట్లు లభిస్తుండటంతో థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి భారీగా ఉండే అవకాశం ఉంటుంది. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

