Hyderabad Crime: ప్రేమించి పెళ్లి చేసుకుంటే నూరేళ్లూ హాయిగా ఉంటారని భావిస్తారు. కానీ నేటి కాలంలో ప్రేమ వివాహాల్లో కూడా మనస్పర్థలు, వేధింపులు పెరిగిపోతున్నాయి.
తాజాగా హైదరాబాద్‌లోని మియాపూర్‌లో జరిగిన ఓ సంఘటన అందరినీ కలిచివేస్తోంది. ఐదేళ్ల పాటు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్ దంపతుల జీవితంలో 50 రోజులకే చీకటి నిండింది.
బిహార్‌కు చెందిన ఇషిక యాదవ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరి పరిచయం ఐదేళ్ల క్రితం ఫేస్‌బుక్ వేదికగా మొదలైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండు వేర్వేరు రాష్ట్రాల వారైనప్పటికీ, తమ ప్రేమను గెలిపించుకోవాలని పట్టుబట్టి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న పాట్నాలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.
Read Also: Moinabad Farmhouse Drugs Case: రోహిత్ సహా ముగ్గురికి మళ్లీ కస్టడీ
Young woman commits suicide within 50 days of marriage.. Was dowry harassment the reason?
Hyderabad Crime: మియాపూర్‌లో కాపురం.. అంతలోనే దారుణం
పెళ్లి తర్వాత ఈ జంట హైదరాబాద్‌కు చేరుకుని మియాపూర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. ఇద్దరూ తమ తమ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే, ఏమైందో ఏమో కానీ, బుధవారం నాడు ఇషికా యాదవ్ తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్త నీరజ్, భార్య స్థితిని చూసి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కట్నం వేధింపులే కారణమా? తల్లిదండ్రుల ఫిర్యాదు
ఇషికా మరణవార్త తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పెళ్లైన కేవలం 50 రోజులకే తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడం వెనుక భర్త నీరజ్ బన్సాల్ హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసం నీరజ్ తమ కుమార్తెను వేధింపులకు గురిచేశాడని, ఆ వేధింపులు భరించలేకే ఇషికా ప్రాణాలు తీసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

