Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లి పేరుతో భారీ దోపిడీ..కిలేడీ పెళ్లికూతురు అరెస్ట్!

పెళ్లి పేరుతో భారీ దోపిడీ..కిలేడీ పెళ్లికూతురు అరెస్ట్!

వార్త 1 month ago

Looter Bride Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో పెళ్లి పేరుతో సాగుతున్న ఒక భారీ మోసం వెలుగుచూసింది. అందమైన యువతిని చూపి, పెళ్లి సంబంధం కుదిర్చి, ఆపై అందినకాడికి దోచుకుని పారిపోతున్న ఒక ముఠా ఆటను పోలీసులు కట్టడి చేశారు.

Read Also :Anantapur crime: అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు: 10 మంది అరెస్ట్

బయటపడింది ఇలా..

బీడ్ జిల్లాకు చెందిన యోగేష్ షిండే అనే యువకుడు తనకు పెళ్లి కావడం లేదని ఏజెంట్లను ఆశ్రయించాడు. వారు ఒక యువతిని చూపించి పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ ప్రక్రియలో పెళ్లి ఖర్చులు మరియు కమీషన్ పేరుతో ఏజెంట్లు యోగేష్ నుంచి రూ. 25 లక్షలు వసూలు చేశారు. పెళ్లైన కొద్ది రోజులకే సదరు భార్య ఇంట్లోని నగదు, బంగారు నగలతో సహా అదృశ్యమైంది. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి.

Looter Bride Maharashtra: విచారణలో షాకింగ్ నిజాలు:

పోలీసుల లోతైన విచారణలో ఆ మహిళ గురించి విస్తుపోయే విషయాలు తెలిశాయి:

  • తొమ్మిది పెళ్లిళ్లు: బాధితుడు యోగేష్ షిండే ఆమెకు తొమ్మిదో భర్త అని తేలింది. అంతకుముందే ఆమె ఎనిమిది మందిని ఇదే తరహాలో పెళ్లి చేసుకుని దోచుకుంది.
  • ముఠా వ్యూహం: ఏజెంట్లు మరియు ఈ ‘లూటర్ బ్రైడ్’ ఒక ముఠాగా ఏర్పడి, పెళ్లి సంబంధాలు దొరకని యువకులను టార్గెట్ చేస్తారు. పెళ్లి తర్వాత కొద్దిరోజులు కాపురం చేసినట్లు నటించి, ఆపై నగలతో పరారవ్వడం వీరి శైలి.
  • భారీ వసూళ్లు: ఒక్కో బాధితుడి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ, ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా జాగ్రత్త పడేవారు.

పోలీసుల హెచ్చరిక

ప్రస్తుతం పోలీసులు సదరు మహిళను, ఆమెకు సహకరించిన ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి సంబంధాల విషయంలో అపరిచిత వ్యక్తులను, మధ్యవర్తులను నమ్మి భారీగా డబ్బులు చెల్లించవద్దని, సంబంధం కుదుర్చుకునే ముందు పూర్తి వివరాలు ఆరా తీయాలని పోలీసులు యువకులకు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గెడ్డ వలస లో పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha