Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లికి 5 రోజులు.. యువకుడి ఆత్మహత్య కలకలం

పెళ్లికి 5 రోజులు.. యువకుడి ఆత్మహత్య కలకలం

వార్త 2 months ago

పెళ్లికి ముందు విషాదం

Marriage Before Suicide : మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం హైదరాబాద్‌లో కలకలం రేపింది. కోండాపూర్‌లోని మై హోం మంగళలో నివాసం ఉంటున్న వెంకట కృష్ణసాయికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది.

సోదరుడికి మెయిల్

ఆత్మహత్యకు ముందు కృష్ణసాయి తన సోదరుడికి ఒక మెయిల్ పంపినట్లు సమాచారం. మెయిల్ చూసిన సోదరుడు వెంటనే ఇంటికి చేరుకుని తలుపులు కొట్టినా స్పందన రాకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే కృష్ణసాయి గొంతు కోసుకుని అపస్మారక స్థితిలో ఉన్నాడు.

Read Also:Collector Himanshu Shukla: మహిళలపై లైంగిక వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

 Marriage Before Suicide

పోలీసుల దర్యాప్తు

తక్షణమే ఆస్పత్రికి తరలించినప్పటికీ అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో అతని ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

జగన్ తోనే మహిళా సాధికారత సాధ్యం: వైసీపీ ఇంచార్జి దీపిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha