Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉగ్ర లింకుల కేసులో మరో ఆరుగురిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

ఉగ్ర లింకుల కేసులో మరో ఆరుగురిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

వార్త 2 months ago

Vijayawada: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ ఉగ్ర లింక్స్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అరెస్టయిన మరో ఆరుగురు నిందితులను కొత్తపేట పోలీసులు గురువారం నుంచి ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వీరిని మధ్యాహ్నం విజయవాడకు తరలించనున్నారు. 13వ తేదీ వరకు వీరిని విచారించేందుకు విజయవాడ సీజేఎం కోర్టు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది. అంతకుముందు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించిన ఐదుగురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తాజా విచారణకు రంగం సిద్ధమైంది.

Read also: Macherla Crime: మాచర్ల కేసులో ట్విస్ట్: గూగుల్ మ్యాప్స్ సాయంతో వచ్చి అఘాయిత్యం!

Vijayawada terror links case inquiry

Vijayawada: పోలీసుల అదుపులో నిందితుల వివరాలు

వారి స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఆరుగురి నుంచి కీలక సమాచారం రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కస్టడీలోకి తీసుకోనున్న నిందితుల్లో బిహార్కు చెందిన షాద్మాన్ దిల్కష్ (తి4), ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్ ( ఏ7), రాజస్థాన్ చెందిన జిషాన్ (ఏ9), పశ్చిమ బెంగాల్కు చెందిన మీర్ ఆసిఫ్ అలీ (ఏ10), పుణెకు చెందిన షారుక్ ఖాన్ (ఏ12), మహారాష్ట్రకు చెందిన షేక్ ఫయాజ్ రెహమాన్ (ఏ13) ఉన్నారు. కాగా, ఈ కేసులో మొత్తం 13 మందిపై కేసు నమోదు కాగా, పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోమ్ కు తరలించారు. మిగిలిన నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచి విచారణ కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha