Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రహదారి నిబంధనలు పాటిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం: సీఐ రేణుక రెడ్డి

రహదారి నిబంధనలు పాటిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం: సీఐ రేణుక రెడ్డి

వార్త 2 months ago

Medak: రహదారి నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలోని టీటీడీ ఫంక్షన్ హాల్ లోనిర్వహించిన అరైవ్ - అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

ఈ సందర్భంగా సిఐ రేణుకా రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీటుబెల్ట్ లేకుండా కార్లు నడపడం ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.

Read Also: Sangareddy RTA and Revenue: ఎస్సార్ మ్యాపింగ్‌పై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం

 Medak: Let’s follow the road rules.. let’s save lives: CI Renuka Reddy

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.అధిక వేగం, మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ఉల్లంఘించడం వంటి చర్యలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పారు. చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తేనే రహదారి ప్రమాదాలనుతగ్గించవచ్చున్నారు.

అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్ అవర్ లో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడే పౌరులకు కేంద్ర ప్రభుత్వం రహవీర్ అనే బిరుదు తో పాటు 25 వేల రూపాయల నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలు, తీసుకోవలసిన చర్యలగురించిపెద్దశంకరంపేట పోలీసులు రూపొందించిన వీడియోలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద శంకరాపేట, అల్లాదుర్గం, రేగోడ్ ఎస్సైలు ప్రవీణ్ రెడ్డి శంకర్, నాయకులు మురళి పంతులుతదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మంత్రి దామోదర్ రాజానర్సింహ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha