Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సర్కారీ బడి - పిల్లల ఒడి: 'బడిబాట'తో గ్రామాల్లో ఉపాధ్యాయుల సందడి

సర్కారీ బడి - పిల్లల ఒడి: 'బడిబాట'తో గ్రామాల్లో ఉపాధ్యాయుల సందడి

వార్త 2 months ago

Badi Bata Program: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచే లక్ష్యంతో ఉపాధ్యాయులు "బడిబాట" కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గ్రామాల వారీగా పర్యటిస్తూ తల్లిదండ్రులను కలుసుకుని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు మండల పరిధిలోని మల్కాపూర్, గొట్టిముక్కుల, బద్దారం గ్రామాలలో ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు.

Read Also: Sangareddy RTA and Revenue: ఎస్సార్ మ్యాపింగ్‌పై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం

 Badi Bata Program: Government School – Children’s lap: Teachers’ buzz in villages with ‘Badi Bata’

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత విద్య, పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను వివరించారు. అలాగే పాఠశాలల్లో అమలు చేస్తున్న ఇంగ్లీష్‌ మీడియం, డిజిటల్‌ తరగతులు, మెరుగైన బోధన విధానాల గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు.గ్రామాల్లో నిర్వహిస్తున్న ఈ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్ధిరాములు, రాణి, నాగవేణి, సౌజన్య తదితరులు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రహదారి నిబంధనలు పాటిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం: సీఐ రేణుక రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha