Fuel Crisis: తాడిపత్రిలో ఉన్న పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ లేవని నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ మాత్రమే లభ్యమవుతుండడంతో వాహనదారులు క్యూ కడుతున్నారు.
ఆయా పెట్రోల్ బంకుల నిర్వాహకులు అందరికీ పెట్రోలు ఇవ్వాలన్న ఉద్దేశంతో 200 రూపాయలు మాత్రమే పెట్రోలు వాహనదారులకు విక్రయిస్తున్నారు. డీజిల్ లభ్యత పూర్తిగా లేకపోవడంతో ఆటోలు, లారీలు, టిప్పర్లు తదితర డీజల్ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డీజల్ కొరత కు ఆయా కంపెనీల యాజమాన్యాలే కారణమని పెట్రోల్ బంకులు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Hyderabad Auto Drivers Protest: నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు
Fuel Crisis: ‘No Stock’ boards at petrol pumps.. Queue of motorists!
పెట్రోల్ కంపెనీల యాజమాన్యం నేరుగా కార్పొరేట్ కంపెనీలకు 40% డీజలు సరఫరా చేస్తుంది. పెట్రోల్ బంకులలో డీజిల్ పట్టుకుంటే ధర తక్కువగా ఉండడంతో ఆయా వాహనదారులు ఎక్కువగా పెట్రోల్ బంకులలో నింపుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థల కస్టమర్లు వారికి నేరుగా విక్రయించే డీజిల్ ధర ఎక్కువగా ఉండటంతో స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకులలో డీజిల్ నింపుకుంటున్నారు. తమకు కార్పొరేట్ సంస్థల వారు డీజిల్ విక్రయాలు జరపడం లేదని దానికి కారణం స్థానికంగా ఉన్న పెట్రోల్ పంపులు యాజమాన్యాల కారణమని అయా కంపెనీల వారు కృత్రిమ కొరత సృష్టించడంతో లభ్యత లేకపోవడంతో స్థానికంగా వాహనాలు నడిపేవారు, పెట్రోల్ బంకుల యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతిరోజు డీజల్ నింపుకొని ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించేవారు అవస్థలు వర్ణనాతీతం. డీజిల్ కృత్రిమ కొరత వల్ల ప్రజా రవాణా, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కంపెనీలతో మాట్లాడి డీజిల్, పెట్రోలు సకాలంలో పెట్రోల్ బంకులకు వచ్చే విధంగా చూడాలని ప్రజలు ,పెట్రోల్ పంపుల యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

