PM Kisan release date:పీఎం కిసాన్ 24వ విడత నిధులు త్వరలో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం దసరా పండుగ కానుకగా ఈ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయించింది.
అక్టోబర్ 17న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు పండగ వేళ ఇది నిజంగా పెద్ద ఊరట అని చెప్పవచ్చు.
Read also: Indigo Flight: బెంగళూరులో ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం
PM Kisan funds to be released on October 17!
అక్టోబర్ 17న ఖాతాల్లో రెండు వేలు జమ
అక్టోబర్ 20న దసరా పండుగ వస్తుండటంతో ప్రభుత్వం ముందుగానే ఈ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఆర్థిక సాయం పొందుతారు. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పండగ ఖర్చుల కోసం రైతులు ఈ డబ్బులను ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
PM Kisan release date:అర్హత ఉన్న రైతులకు మాత్రమే నిధులు
ఈ పథకం ప్రయోజనం పొందాలంటే రైతులు తమ ఆధార్ కార్డు మరియు బ్యాంకు వివరాలు సరిగ్గా ఉంచుకోవాలి. ఈ కేవైసి పూర్తి చేసిన వారికి మాత్రమే నిధులు త్వరగా అందుతాయి. ఎవరైనా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే వెంటనే చేసుకోవడం మంచిది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.
Epaper: epaper.vaartha.com

