Crime news : కన్న తండ్రి అని కూడా చూడకుండా, కేవలం పింఛను డబ్బుల కోసం ఓ కొడుకు కర్రతో కొట్టి ప్రాణాలు తీసిన ఘోర కలి అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగుచూసింది.
పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పింఛను డబ్బుల విషయమై జరిగిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలను బలిగొంది.
పింఛను గొడవ.. తండ్రిపై కర్రతో దాడి
పెదబయలు మండలం వెలుపాలెం గ్రామానికి చెందిన లకేయి సింహాచలం (60) సోమవారం రాత్రి తన కొడుకు రమేష్‌తో పింఛను డబ్బుల విషయమై గొడవపడ్డాడు. ఈ ఘర్షణ ముదరడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు రమేష్.. తండ్రి చేతిలో ఉన్న కర్రనే లాక్కుని అతని తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సింహాచలం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు పరారయ్యాడు.
Read also : MLA Lokam Naga Madhavi : మత్స్యకారులకు రూ.20,000 భృతి!
Crime newsఐదేళ్ల క్రితం భార్యను కూడా..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఒక షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. నిందితుడైన రమేష్ ఐదేళ్ల క్రితం తన భార్యను కూడా ఇలాగే దారుణంగా చంపేసి, జైలు శిక్ష అనుభవించి, ఇటీవలనే తిరిగి స్వగ్రామానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న రమేష్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

