Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తీర్పు వాయిదా

పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తీర్పు వాయిదా

వార్త 2 months ago

TG High Court: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అంశం ఇప్పుడు న్యాయస్థానంలో ఉంది. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ ఎస్‌కే జోషి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

కమిషన్ నివేదికను రద్దు చేయాలని వారు కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై గతంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

Read Also:Panchayat Raj Department: పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు.. ఆరుగురు అధికారులకు ప్రమోషన్

 The Bench Adjourns Verdict… Must Wait Until April 22!

TG High Court: ఏప్రిల్ 22న తుది తీర్పు.. ఉత్కంఠలో రాజకీయ వర్గాలు

తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించడాన్ని ఉన్నత న్యాయస్థానం మరోసారి వాయిదా వేసింది. ఈ నెల 22వ తేదీన తుది తీర్పును వెల్లడించనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ కేసులో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కమిషన్ నివేదిక చెల్లుబాటు అవుతుందా లేదా అనే అంశంపై రాజకీయ నేతల భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో, ఈ నెల 22న వెలువడే తీర్పు అత్యంత కీలకంగా మారనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

దేశంలోనే నం.1 తెలంగాణ ఆడిట్ శాఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha