Minister Lokesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు రైతులు సంక్షోభంలో ఉన్న ప్రతీసారీ అండగా నిలిచింది తెలుగుదేశం ప్రభుత్వమేనని రాష్ట్ర విద్యా, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది విపరీతంగా పెరిగిన పొగాకు ఉత్పత్తి నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అదనపు ఉత్పత్తికి సంబంధించి ప్రతి కిలోకు రూ.10 చొప్పున మొత్తం రూ.100 కోట్ల ఆర్థిక సాయాన్ని సత్వరమే అందిస్తున్నామని, ఈ పంపిణీ ప్రక్రియను గురువారం నుంచే ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఈ ఏడాది పొగాకు సాగు, దిగుబడి గణాంకాలపై మంత్రి లోకేశ్ స్పష్టత ఇచ్చారు.
Minister Lokesh
Minister Lokesh : గత వైకాపా ప్రభుత్వంపై విమర్శలు - క్షేత్రస్థాయి ఆధారాల విడుదల
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులను ఘోరంగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఆరోపించారు: 2019, 2020 సంవత్సరాల్లో పొగాకు మార్కెట్ ధరలు తీవ్రంగా పడిపోయి కిలో రూ.121, రూ.123కు చేరినప్పుడు నాటి ప్రభుత్వం ఒక్క కిలో కూడా కొనుగోలు చేయకుండా రైతులను నడిరోడ్డుపై వదిలేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం పొగాకు రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చేస్తున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. క్షేత్రస్థాయిలో తమకు ఎలాంటి వడ్డీ లేని రుణాలు అందలేదని స్వయంగా పొగాకు రైతులే వెల్లడించిన వీడియో ఆధారాలను మంత్రి లోకేశ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

