Mahabubnagar POCSO Case: మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు అత్యంత కఠినమైన శిక్షను ఖరారు చేసింది.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడు గుర్రాల బాలయ్య అలియాస్ బాలి (దోషి) పై విచారణ పూర్తికావడంతో.. మహబూబ్‌నగర్‌లోని ‘పోక్సో (POCSO) మరియు అత్యాచార కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం’ గౌరవ న్యాయమూర్తి తమన్ రాజరాజేశ్వరి బుధవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించారు.
Read also: Meenakshi natarajan: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దుకు దారితీసిన ఆ కేసు ఏమిటి?
నిందితుడిని నిలువునా దోషిగా నిర్ధారిస్తూ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష (జైలు శిక్ష) విధించడంతో పాటు, రూ. 25,000 నగదు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసులో అభాగ్యురాలైన బాధితురాలికి న్యాయం చేకూర్చేందుకు జిల్లా దర్యాప్తు అధికారులు సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ చేపట్టి, పక్కా శాస్త్రీయ ఆధారాలు, ఎఫ్‌ఎస్ఎల్ (FSL) నివేదికలు, సాక్ష్యాలను పటిష్టంగా కోర్టు ముందు ప్రవేశపెట్టడంతోనే దోషికి ఇన్నేళ్ల సుదీర్ఘ శిక్ష పడేందుకు వీలైంది.
సమన్వయంతో పనిచేసి కన్విక్షన్ సాధించిన టీమ్..
మహబూబ్‌నగర్ జిల్లాలో పోక్సో కేసులలో నేరస్థులకు శిక్షల శాతం (Conviction Rate) పెంచేందుకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ కేసులో మొదటి నుండి చాకచక్యంగా దర్యాప్తు నిర్వహించిన రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) గాంధీ నాయక్, ఎస్సై ఎ. వెంకటేశ్వర్లు, మరియు ప్రస్తుతం స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (SHO) విధులు నిర్వహిస్తున్న ఎస్సై జి. విజయ్ కుమార్‌లు కోర్టుకు అవసరమైన సాక్ష్యాలను పక్కాగా రికార్డ్ చేశారు.
కోర్టు విచారణ సమయంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (Special PP) ఎం. జాన్ తన వాదనలను బలంగా వినిపించగా.. కోర్టు లైజన్ అధికారులు బాలకృష్ణ (ఏఎస్ఐ), కృష్ణయ్య (పీసీ), శంకర్ (పీసీ), రహీమ్ (పీసీ), మరియు సీడీఓ అశోక్ రెడ్డి (పీసీ) లు సమన్వయంతో పనిచేసి సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టి కేసు కన్విక్షన్ సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు.
Mahabubnagar POCSO Case: పోలీస్ యంత్రాంగాన్ని అభినందించిన ఎస్పీ డి. జానకి
కేసు దర్యాప్తు ప్రారంభమైన నాటి నుండి కోర్టు తుది విచారణ వరకు నిరంతరం నిఘా ఉంచి, సమర్థవంతంగా పనిచేసి కామాంధుడికి శిక్ష పడేలా ఉమ్మడిగా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు లైజన్ అధికారులను మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) డి. జానకి జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో చిన్న పిల్లలు, బాలలపై ఇలాంటి అమానవీయ లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మహిళలు, బాలికల రక్షణకు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా కోర్టుల ద్వారా స్పీడీ ట్రయల్స్ (వేగవంతమైన విచారణ) నిర్వహిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

