Pawan Kalyan: పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అటవీ అధికారులను అప్రమత్తం చేశారు.
సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు, వారి పశువుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వన్యమృగం కదలికలపై నిరంతరం డేగకన్ను వేసి ఉంచాలని ఆయన ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Tiger Movement Thimmapuram
తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారం
ఇటీవల పోలవరం జిల్లా పరిధిలోని చికిలింత పంచాయతీలో పెద్దపులి దాడి చేసి, ఏకంగా 9 పశువుల దూడలను హతమార్చిన ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పులి తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతున్నట్లు అటవీ శాఖ యంత్రాంగం గుర్తించింది. దీనిపై అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం అటు మానవాళికి, ఇటు పశుసంపదకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.
Pawan Kalyan: నిఘా కోసం ప్రత్యేక ‘హనుమాన్’ బృందాలు
పులి కదలికలను క్షుణ్ణంగా అంచనా వేసేందుకు అధునాతన డ్రోన్ కెమెరాలతో పాటు ట్రాప్ కెమెరాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. వన్యమృగంపై 24 గంటల పాటు నిఘా పెట్టేందుకు ప్రత్యేక ‘హనుమాన్’ బృందాలను రంగంలోకి దించినట్లు వివరించారు. అవసరమైతే ఈ టీమ్‌ల సంఖ్యను మరింత పెంచాలన్నారు. పులికి ఎటువంటి హాని కలగకుండా, దానిని సురక్షితంగా బంధించి అడవిలోకి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF) స్థాయి అధికారి స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఇదే సమయంలో, పులి దాడిలో పశువులను నష్టపోయిన రైతులకు అటవీ శాఖ ఇప్పటికే మధ్యంతర ఉపశమన పరిహారాన్ని అందజేసిందని, మిగిలిన పూర్తి నష్టపరిహారాన్ని కూడా త్వరలోనే చెల్లిస్తామని అధికారులు మంత్రికి నివేదించారు. అడవికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండేలా విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
పెద్ద ఎత్తున పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ కసరత్తు ?

