Tekkali Praja Darbar: స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజల నుంచి వినతులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వీకరించారు.
అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ప్రజలు సమర్పించిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బగాది శేషగిరిరావు, ఆర్డీఓ ఎమ్. కృష్ణ మూర్తి, తహసిల్దార్ సత్యం, తదితరులు పాల్గొన్నారు.
Read also: Guntur Crime: గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి కాల్పుల కలకలం: అసలు ఏం జరిగిందంటే?
Atchennaidu honoring school students
Tekkali Praja Darbar: పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రభంజనం
13 మంది విద్యార్థులను అభినందించిన మంత్రి ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర విద్యా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అత్యుత్తమ మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులను సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, అధికారులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

