Prabhas Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'స్పిరిట్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా తృప్తి డిమ్రి నటిస్తుండగా, కీలక ప్రతినాయక పాత్రలో వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నారు. యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
షూటింగ్‌లో చేరిన తృప్తి డిమ్రి
తాజా సమాచారం ప్రకారం తృప్తి డిమ్రి తాజాగా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లోని అజీజ్ నగర్ ప్రాంతంలో ఆమెకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రబృందం చిత్రీకరించింది. ఇప్పుడు షూటింగ్‌ను కోటి ఉమెన్స్ కాలేజీ ప్రాంతానికి మార్చనున్నట్లు సమాచారం. అక్కడ ప్రభాస్, తృప్తి డిమ్రిపై మరికొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
Read Also : EPIC Priyasakhi Song: ఆనంద్ దేవరకొండ 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' నుంచి మెలోడీ పాట విడుదల
Prabhas Spiritపవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో ప్రభాస్
ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఇంటెన్స్ కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. 'స్పిరిట్' సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

