Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడు ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయడం లేదు.. ఎందుకంటే?

తమిళనాడు ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయడం లేదు.. ఎందుకంటే?

వార్త 2 months ago

Annamalai: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థుల జాబితాలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పేరు లేకపోవడంపై నెలకొన్న సస్పెన్స్‌కు ఆయనే స్వయంగా తెరదించారు.తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా ఎదిగిన కె.

అన్నామలై, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీనిపై శనివారం చెన్నై చేరుకున్న అన్నామలై మీడియా ప్రతినిధులతో మాట్లాడి స్పష్టతనిచ్చారు.

Read Also:Kerala Assembly Elections: కేరళలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది.. ఎన్డీయే విజయం ఖాయం.. శ్రీనివాస వర్మ

Annamalai: పోటీకి దూరం.. ఎందుకు?

" నేను ఎన్నికల రేసులో కానీ, జాబితాలో కానీ లేను. ఈ ఎన్నికల్లో తమిళనాడు వ్యాప్తంగా అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయటమే నా బాధ్యత. ప్రస్తుతానికి ఏప్రిల్ 7వ తేదీ వరకూ పుదుచ్చేరి, కేరళలో ఎన్నికల ప్రచారం చేయమని పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది. ఏప్రిల్ 7వ తేదీ తర్వాత నుంచి ఏప్రిల్ 23 వరకూ తమిళనాడులో ప్రచారం చేస్తా. ఇది పార్టీ అధిష్టానం నాకు అప్పజెప్పిన బాధ్యత , ఈ బాధ్యతను నేను పూర్తి చేయాల్సి ఉంది"

 Tamil Nadu Assembly Elections 2026

అని కన్నూరు విమానాశ్రయంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అన్నామలై బదులిచ్చారు.ఈ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని అనుకోవటం లేదని తాను గతంలోనే బీజేపీ కోర్ కమిటీకి తెలియజేసినట్లు అన్నామలై తెలిపారు. రాష్ట్రం నుంచి కేంద్ర పెద్దల ఆమోదం కోసం పంపించిన ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలోనూ తన పేరు లేదన్నారు. తనకు ఎన్నికల్లో టికెట్ నిరాకరించలేదని.. తానే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అన్నామలై తెలిపారు. తన నిర్ణయాన్ని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇంఛార్జి పీయూష్ గోయెల్‌కు సైతం వారం కిందటే తెలియజేసినట్లు అన్నామలై క్లారిటీ ఇచ్చారు. తన నిర్ణయాన్ని గౌరవించినందుకు బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మద్యాన్ని మట్టుపెట్టే మార్గమే లేదా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha