Singanamala: శింగనమల ఏప్రిల్ 17 గత రెండు రోజులుగా మండల కేంద్రంలో జరుగుతున్న ఎన్యుమారైటర్లు. సూపర్వైజర్లుకు. శిక్షణ తరగతులు మూడవరోజు శుక్రవారం ప్రాక్టికల్ శిక్షణ కొరకు తహసిల్దార్ శేషారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికి వెళ్లి జనగణన పోర్టల్ ద్వారా ఆన్లైన్ స్వీయగణనపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ శేషారెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో జనగణన కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. కావున ప్రజలందరూ బాధ్యతగా ఈ ప్రక్రియలో పాల్గొని ఖచ్చితమైన వివరాలు అందించాలని ఆయన కోరారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని స్వీయ గణన చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుంది అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Read also: Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రి పటిష్టతపై ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తల అధ్యయనం ముమ్మరం
Singanamala: Census plays a key role in designing government schemes: Tahsildar Sesha Reddy
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు.. అర్థరాత్రి వేళ జనాల పరుగులు

