Dailyhunt
ప్రధాని మోదీ హత్యకు కుట్ర? ముగ్గురు అరెస్ట్!

ప్రధాని మోదీ హత్యకు కుట్ర? ముగ్గురు అరెస్ట్!

వార్త 1 week ago

దేశ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హతమారుస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన బిహార్‌లో కలకలం రేపింది. ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై బిహార్ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.

నిందితుడు పంపిన ఒక ఈమెయిల్ ఆధారంగా అంతర్జాతీయ నిఘా సంస్థలు అప్రమత్తం కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Read Also: HDFC Banking Services Down: రేపు తెల్లవారుజామున బ్యాంకింగ్ సేవలు బంద్!

 PM Modi: Conspiracy to assassinate Prime Minister Modi? Three arrested!

CIAకు ఈమెయిల్.. 22 రోజుల్లో హతమారుస్తానని బెదిరింపు

బిహార్‌లోని బక్సర్ జిల్లాకు చెందిన అమన్ తివారీ అనే యువకుడు అమెరికా నిఘా సంస్థ CIA కు ఒక ఈమెయిల్ పంపాడు. అందులో తాను 22 రోజుల్లో ప్రధాని మోదీని హతమారుస్తానని, ఇందుకు ప్రతిఫలంగా తనకు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వాలని కోరాడు. ఈ మెయిల్‌ను సీరియస్‌గా తీసుకున్న అంతర్జాతీయ నిఘా వర్గాలు భారతీయ భద్రతా సంస్థలను అప్రమత్తం చేశాయి.

పోలీసుల మెరుపు దాడి.. మొబైల్స్, ల్యాప్‌టాప్ స్వాధీనం

సమాచారం అందుకున్న బిహార్ పోలీసులు నిందితుడు అమన్ తివారీ ఆచూకీని కనిపెట్టి, బక్సర్ జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి కుట్రకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా అమన్ తివారీకి సహకరించిన మరో ఇద్దరు అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్న పోలీసులు, దీని వెనుక ఏదైనా ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా లేదా ఇది కేవలం డబ్బు కోసం చేసిన ఆకతాయి పనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మహిళలకు రూ.3000 ఆర్థిక సాయం- బీజేపీ మేనిఫెస్టో

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha