Vijayasai Reddy: దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
పెట్రోల్, డీజిల్, బంగారం వినియోగం తగ్గించుకోవాలని ప్రధాని చేసిన పిలుపునకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతు ప్రకటించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆందోళనకరంగా పడిపోతున్న నేపథ్యంలో ఈ సూచనలు పాటించడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: Visakhapatnam road accident: నిలిపి ఉంచిన లారీని ఢీకొన్న వ్యాన్.. చికిత్స పొందుతూ వ్యక్తి మరణం
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్
“డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ ₹95.7కు పడిపోవడం ఆందోళన కలిగించే విషయం. రూపాయి విలువ మరింత దిగజారకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జోక్యం చేసుకుంటుందని ఆశిస్తున్నాను. దీనివల్ల ఎగుమతిదారులు లాభపడుతున్నప్పటికీ, దిగుమతులు మన విలువైన విదేశీ మారక నిల్వలను (Forex Reserves) హరించివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. దాదాపు 250 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులను-పెట్రోలియం ($135B), బంగారం ($72B), వంటనూనెలు ($19.5B), ఎరువులను ($14.5B)-తగ్గించుకోవాలని గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన విజ్ఞప్తి జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంది. భారత్ ఖచ్చితంగా స్వదేశీ ఉత్పత్తిని పెంచడం మరియు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంపై దృష్టి సారించాలి.” అని విజయసాయిరెడ్డి సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా సీఎం చంద్రబాబు అడుగులు

