Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి!

ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి!

వార్త 2 weeks ago

Governor Shiv Pratap Shukla: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మే 29, ప్రభాతవార్త: ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులకు సూచించారు.

శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్‌తో కలిసి వందేమాతరం గీతం ఆలపించి జ్యోతి ప్రజ్వలన చేశారు.

Read Also: Retired Employees: రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

క్షయవ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందించాలి

జిల్లాలో 464 మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారిని అధికారులు దత్తత తీసుకుని నెలకు సరిపడా మందులు, పౌష్టికాహారం అందించాలని గవర్నర్ సూచించారు.

District Collector Haritha welcoming the Governor.

చాలామంది దగ్గు, బరువు తగ్గడం వంటి లక్షణాలను బయటకు చెప్పకుండా బాధపడుతుంటారని, అలాంటి వారిని గుర్తించి సరైన వైద్య చికిత్సలు అందించాలని తెలిపారు. చికిత్స ద్వారా క్షయవ్యాధి పూర్తిగా నయం అవుతుందనే అవగాహన ప్రజల్లో కల్పించాలని సూచించారు.

మాదకద్రవ్యాలపై యువతకు అవగాహన కల్పించాలి

యువత మాదకద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోవాలని తెలిపారు.

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని గవర్నర్ సూచించారు. ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

 The Collector presenting a memento to the Governor.

జిల్లాలో శాఖల వారీగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ హరిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు. ఎస్పీ నితికా పంత్ జిల్లాలో శాంతిభద్రతలు, మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలపై వివరాలు వెల్లడించారు.

Governor Shiv Pratap Shukla: అధికారుల స్వాగతం, గౌరవ వందనం

హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.

రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం తీసుకున్న కలెక్టర్‌కు ధృవపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరిష్ బాబు, ఎమ్మెల్సీ దండే విట్టల్, జిల్లా అధికారులు, రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha