Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ను చిత్ర పరిశ్రమ నుండి బహిష్కరించాలంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అలాగే పలువురు ఆధ్యాత్మిక గురువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఒక యూట్యూబర్‌కు ప్రకాశ్ రాజ్ మద్దతుగా నిలవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Telangana New Airports: తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్కడంటే?
యూట్యూబర్ రావణ్ అరెస్ట్.. ప్రకాశ్ రాజ్ స్పందన
ఇటీవల ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో హైదరాబాద్‌కు చెందిన యూట్యూబర్ రావణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ అరెస్టును తప్పుబడుతూ ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా, ఇలా అరెస్టులకు పాల్పడటం ఏమాత్రం తగదంటూ ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Prakash Raj: ప్రకాశ్ రాజ్ తీరు సిగ్గుచేటు.. విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటన
ఈ పరిణామాలపై బుధవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.. ప్రకాశ్ రాజ్ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. వ్యక్తిగత దూషణలను, సమాజంలో మత విద్వేషాలను రేకెత్తించేలా మాట్లాడుతున్న వారికి మద్దతు తెలపడం ప్రకాశ్ రాజ్ దిగజారుడుతనానికి నిదర్శనమని, ఆయన తీరు సమాజానికి హానికరమని విమర్శించారు.
read also:

