Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రకాశం జిల్లాలో కూతురితో తిరుగుతున్నాడని ముక్కలుగా నరికిన తండ్రి.

ప్రకాశం జిల్లాలో కూతురితో తిరుగుతున్నాడని ముక్కలుగా నరికిన తండ్రి.

వార్త 4 days ago

Crime news : ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెంలో ఒళ్ళు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కక్షతో ఓ వ్యక్తి, ఒక యువకుడిని దారుణంగా హత్య చేశాడు.

అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సమీపంలోని ఒక పాడుబడిన బోరుబావిలో పడేసిన కిరాతకం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అనుమానమే ప్రాణం తీసింది!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యర్రగొండపాలెం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడిని, అదే గ్రామానికి చెందిన వెంకటనారాయణ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. వెంకటనారాయణ కూతురితో ఆంజనేయులు సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానమే ఈ దారుణ హత్యకు దారితీసింది. ఈ విషయమై గత కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య తీవ్ర గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంజనేయులుపై పగ పెంచుకున్న వెంకటనారాయణ, అతడిని వదిలించుకోవాలని పక్కా ప్లాన్ వేశాడు.

Read also : MLA Lokam Naga Madhavi : మత్స్యకారులకు రూ.20,000 భృతి!

 Crime news

మిస్సింగ్ కేసుగా మొదలై.. బోరుబావిలో శవమై!

కొన్ని రోజుల క్రితం ఆంజనేయులు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాత గొడవల నేపథ్యంలో వెంకటనారాయణను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘోర ఉదంతం బయటపడింది. ఆంజనేయులును హతమార్చిన తర్వాత, శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముక్కలుగా నరికి, పొలాల్లో ఉన్న బోరుబావిలో పడేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో మృతదేహ అవశేషాలను వెలికితీసే పనిలో పడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తిరుపతిలో రూ. కోటి విలువైన 500 మొబైల్ ఫోన్ల రికవరీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha