Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రముఖ యూట్యూబర్ నందు కుటుంబంపై చీటింగ్ కేసు నమోదు

ప్రముఖ యూట్యూబర్ నందు కుటుంబంపై చీటింగ్ కేసు నమోదు

వార్త 2 weeks ago

Nandus World YouTuber Case: ప్రముఖ యూట్యూబ్ జంట, 'నందుస్ వరల్డ్' ఛానెల్ నిర్వాహకురాలు రామా నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, మరియు ఆయన తండ్రిపై ఎన్టీఆర్ జిల్లాలో మోసం కేసు నమోదైంది.

బ్రిటన్ (UK) వీసా రెన్యూవల్ చేసి పెడతామంటూ ఓ వ్యక్తి నుంచి రూ. 15 లక్షలు వసూలు చేసి, ఆపై నమ్మకద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) దాఖలైంది.

 UK Visa Fraud

read also: Peddi Movie Review : బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పెద్ది.. ట్విట్టర్ టాక్ వైరల్

కన్సల్టెన్సీ పేరుతో నమ్మించి..

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఈ ఫిర్యాదు చేశారు. తన యూకే వీసా గడువు ముగిసిపోతుండటంతో, దానిని పునరుద్ధరించుకునేందుకు ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ని నడుపుతున్న నందు ఫ్యామిలీని సంప్రదించారు. వీసా ప్రక్రియను ఎంతో సులభంగా పూర్తి చేయిస్తామని హామీ ఇవ్వడంతో, వారిని నమ్మి రూ. 15 లక్షలు సమర్పించుకున్నట్లు బాధితుడు పేర్కొన్నారు. అయితే ఎంత కాలం గడిచినా వీసా పని పూర్తి చేయకపోగా, ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Nandus World YouTuber Case: పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు

బాధితుడి నుంచి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా చీటింగ్, నమ్మకద్రోహం సెక్షన్ల కింద (క్రైమ్ నంబర్ 515/2025) కేసు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం ఎస్ఐ బి. రాజు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో రామా నందనకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్‌ను చూసే తాము గుడ్డిగా నమ్మి డబ్బులు ఇచ్చామని బాధితుడు పోలీసుల వద్ద పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో మరికొన్ని వీడియోలు వైరల్!

ఈ కేసు నమోదు కావడం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్ర సంచలనంగా మారింది. ఇదే కన్సల్టెన్సీ ద్వారా బ్రిటన్‌లో ఉద్యోగాలు, వీసాల పేరిట తమ వద్ద కూడా రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేసి మోసం చేశారంటూ మరికొందరు బాధితులు చేస్తున్న ఆరోపణల వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను నందు కుటుంబం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. తమ ఎదుగుదలను ఓర్వలేక కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వారు వాదిస్తున్నారు.

పాపులారిటీ తెచ్చిన వివాదం

ఒకప్పటి నటి అయిన రామా నందన.. తన భర్త, పిల్లలతో కలిసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చేసే ఫ్యామిలీ వ్లాగ్స్ (Family Vlogs) ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ప్రజాదరణ పొందారు. ఈ క్రేజ్‌తో వీరికి వెండితెరపై కూడా అవకాశాలు దక్కాయి. అయితే, తాజాగా కన్సల్టెన్సీ మోసాల వివాదంలో ఈ స్టార్ యూట్యూబ్ జంట పేరు వినిపించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారంలో అసలు నిజానిజాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

'పెద్ది' సక్సెస్ కావాలంటూ తిరుమలకు కాలినడకన జాన్వి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha