Bengaluru: భారతదేశ ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగళూరు (Bengaluru) నగరం అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ టెక్ టాలెంట్ మార్కెట్ల జాబితాలో బెంగళూరు ఏకంగా 6వ స్థానాన్ని కైవసం చేసుకుని గ్లోబల్ టెక్ హబ్‌గా తన సత్తా చాటింది.
‘కొలియర్స్ గ్లోబల్ టెక్ మార్కెట్స్ 2025’ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. పారిస్, బోస్టన్, టోక్యో వంటి ప్రపంచ స్థాయి నగరాలను వెనక్కి నెట్టి బెంగళూరు ఈ మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ వంటి దిగ్గజ నగరాల సరసన బెంగళూరు నిలవడం విశేషం.
Read Also :Adani Prahaar LMG: భారత సైన్యానికి అదానీ డిఫెన్స్ 'ప్రహార్' మెషిన్ గన్‌లు
There are one million tech professionals in the city; of these, 94,000 are AI experts.
10 లక్షల మంది ఐటీ నిపుణులు.. గ్లోబల్ సెంటర్లకు కేరాఫ్ అడ్రస్‌గా బెంగళూరు
బెంగళూరు నగరం కేవలం సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితం కాకుండా, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా రూపాంతరం చెందడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లోనే అత్యధికంగా సుమారు 10 లక్షల మంది టెక్ ప్రొఫెషనల్స్ ఇక్కడ ఉండటం ఒక ఎత్తయితే, అందులో 94,000 మంది కృత్రిమ మేధ (AI) నిపుణులు ఉండటం గమనార్హం. దీనికి తోడు 2,400కు పైగా స్టార్టప్‌లు, 28కి పైగా యూనికార్న్ కంపెనీలతో ఇది ‘స్టార్టప్ రాజధాని’గా పేరుగాంచింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ సెంటర్లు (GCCs) తమ అతిపెద్ద పరిశోధనా కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేయడం నగరం యొక్క ప్రాధాన్యతను పెంచింది.
Bengaluru: టెక్ టాలెంట్‌లో సరికొత్త రికార్డు
నగర అభివృద్ధిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరుకు ఉన్న కాస్మోపాలిటన్ సంస్కృతి, దశాబ్దాల ఐటీ పునాది మరియు బలమైన విద్యా వ్యవస్థ కారణంగానే ఈ స్థాయి వృద్ధి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. నగరంలో 250కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉండటం టాలెంట్ లభ్యతకు ప్రధాన వనరుగా మారిందని గుర్తు చేశారు. అయితే, ఇంతటి భారీ వృద్ధిని తట్టుకునేలా రవాణా వ్యవస్థ, పట్టణ ప్రణాళిక వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

