Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచంలో మోదీ లాంటి లీడర్ ఎవరూ లేరు - చంద్రబాబు

ప్రపంచంలో మోదీ లాంటి లీడర్ ఎవరూ లేరు - చంద్రబాబు

వార్త 3 days ago

Modi : ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వంటి అసాధారణ నాయకుడు మరొకరు లేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు.

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ (NDA) మిత్రపక్షాల కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రధాని మోదీ నాయకత్వ పటిమపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా అక్కడ దేశానికి దక్కుతున్న ఆదరణ, గౌరవం అపూర్వమైనవని చంద్రబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ఠను, బలాన్ని మోదీ సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని ఆయన అభినందించారు. గత పాతికేళ్లుగా (25 ఏళ్లుగా) ప్రజాసేవలో ఉన్న మోదీ, ప్రజలు ఆయన నుండి ఆశించిన దానికంటే ఎంతో ఎక్కువగా దేశాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Read Also : నెహ్రూతో మోదీని పోల్చడం పై శరద్ పవార్ విమర్శలు

 PM Modi

'నేషన్ ఫస్ట్' నినాదం.. ప్రధాని మోదీ ఎనర్జీపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రధాని నరేంద్ర మోదీ నిరంతర శ్రమను, ఆయన పనితీరును చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. “దేశ ప్రధానిగా అంత పెద్ద బాధ్యతలు మోస్తూ, పగలు రాత్రి అనకుండా నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ మోదీ ఎప్పుడూ అలసిపోవడం నేను చూడలేదు” అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోదీ చూపిస్తున్న అదే అంకితభావం, శక్తి సామర్థ్యాలతో నేడు దేశమంతా ఆయన అడుగుజాడల్లో నడుస్తోందని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలన్నీ కేవలం అధికారమే పరమావధిగా కాకుండా, ‘నేషన్ ఫస్ట్’ (దేశమే ప్రథమం) అనే ఒకే ఒక్క నినాదంతో, ఉమ్మడి జాతీయ ఎజెండాతో ముందుకు సాగుతున్నాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ సమన్వయంతో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన ఈ భేటీలో ఆశాభావం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha