Visakhapatnam gang war : విశాఖపట్నం జిల్లా తిమ్మాపురం రోడ్డులోని శివశక్తి నగర్‌లో విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఘర్షణకు దారితీసింది. చంద్రంపాలెం పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య ప్రేమ వ్యవహారంలో తలెత్తిన చిన్న పాటి వివాదం చిలికి చిలికి పెద్దదై, రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్‌గా మారింది.
Read Also: Good news from the Centre for AP : ఏపీకి కేంద్రం మరో శుభవార్త
Visakhapatnam gang war
Visakhapatnam gang war : వివాదం వెనుక ఉన్న ప్రధాన వివరాలు
పాఠశాలలో మొదలైన తగవుతో రెండు రోజుల క్రితం విద్యార్థులు, యువకులు వర్గాలుగా విడిపోయి శివశక్తి నగర్ ప్రాంతంలో భౌతిక దాడులకు దిగారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో అటుగా బైక్‌పై వెళ్తున్న అపరిచిత వ్యక్తిని కూడా అడ్డుకుని యువకులు దాడికి పాల్పడ్డారు. గురువారం రాత్రి మళ్లీ ఘర్షణకు యత్నించగా స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనలో పాల్గొన్న మొత్తం 20 మంది యువకుల్లో 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి గొడవకు దిగినట్లు గుర్తించిన పోలీసులు, ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ముగ్గురు మేజర్లు కాగా, మిగిలిన ముగ్గురు మైనర్లు.

