Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియుడి మోజులో భర్త ప్రాణం తీసిన భార్య! చివరికి ఎలా దొరికిపోయారంటే?

ప్రియుడి మోజులో భర్త ప్రాణం తీసిన భార్య! చివరికి ఎలా దొరికిపోయారంటే?

వార్త 2 weeks ago

Miyapur Husband Murder Case: హైదరాబాద్ నగరంలో వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఒక ఘోర హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది. అంతటితో ఆగకుండా ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గుట్టుచూడకుండా పూడ్చిపెట్టి, ఆపై పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది.

తన భర్త హఠాత్తుగా కనిపించడం లేదంటూ సదరు భార్యే స్వయంగా గతేడాది నవంబర్ నెలలో మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పట్లో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నెలలు గడుస్తున్నా సదరు వ్యక్తి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు విచారణను మరింత తీవ్రం చేశారు.

Read Also : Wayanad Landslide: వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్‌లో కొండచరియలు విరిగి ఇద్దరు మృతి

 Wife kills husband, blinded by infatuation for her lover! How were they finally caught?

Miyapur Husband Murder Case: కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్‌తో దొరికిపోయిన కిలాడీ భార్య

ఈ మిస్సింగ్ కేసును ఛేదించే క్రమంలో పోలీసులకు సదరు భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో అధికారులు ఆమె మొబైల్ ఫోన్ కాల్ రికార్డులను (CDR) లోతుగా పరిశీలించారు. ఒక నిర్దిష్ట నంబర్‌తో ఆమె నిరంతరం సుదీర్ఘంగా మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ ఆధారంగా విచారించగా ఆమెకు ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. దీనికి తోడు భర్త అదృశ్యమైన రోజు నాటి పరిసర ప్రాంతాల సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో కొన్ని అనుమానాస్పద దృశ్యాలు లభ్యమయ్యాయి.

ప్రియుడితో కలిసి హత్య.. గుట్టురట్టు చేసిన పోలీసులు

కాల్ డేటా, సీసీ కెమెరాల గట్టి ఆధారాలతో పోలీసులు భార్యను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతోనే, ప్రియుడితో కలిసి అతడిని దారుణంగా అంతమొందించినట్లు అంగీకరించింది. హత్య చేసిన అనంతరం ఎవరికీ దొరక్కుండా మృతదేహాన్ని ఒక రహస్య ప్రదేశంలో పూడ్చిపెట్టినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ షాకింగ్ నిజాలు వెలుగులోకి రావడంతో మియాపూర్ పోలీసులు నిందితులైన భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని గుర్తించి, శవాన్ని వెలికితీసేందుకు తదుపరి చర్యలు చేపట్టారు.

'హార్పిక్' ఇంజక్షన్‌తో భర్త ప్రాణం హరించింది..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha