Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియుడితో కలిసి భర్తను పాముతో కరిపించి చంపిన కిరాతక భార్య!

ప్రియుడితో కలిసి భర్తను పాముతో కరిపించి చంపిన కిరాతక భార్య!

వార్త 2 weeks ago

UP Crime News: ఉత్తరప్రదేశ్ (UP) మీరట్ జిల్లాలో అత్యంత కలకలం రేపిన ఒక భయంకరమైన హత్య ఉదంతం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తి ..

ఒక నిండు ప్రాణాన్ని అత్యంత క్రూరమైన పద్ధతిలో బలితీసుకునేలా చేశాయి. సినిమా స్టోరీని తలపించేలా భర్తను పాము కాటుతో చంపిన వికృత రూపం మీరట్ జిల్లా హస్తినాపురంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భందోరా గ్రామానికి చెందిన అతుల్ పన్వార్ (35), దామిని అనే దంపతులు హస్తినాపూర్‌లో ఒక ప్రైవేట్ పాఠశాలను నడుపుతున్నారు. ఈ క్రమంలోనే సదరు స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తుషార్ అనే యువకుడితో దామినికి వివాహేతర సంబంధం (ఎఫైర్) ఏర్పడింది. వీరిద్దరి వ్యవహారం కాస్తా అతుల్‌కు అడ్డుగా మారడంతో, అతడిని ఎలాగైనా శాశ్వతంగా వదిలించుకోవాలని ఆ ఇద్దరూ డిసైడ్ అయ్యారు.

Read Also : Godavari River Missing Case: చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజన మహిళలు గల్లంతు

 Ruthless wife kills husband by having him bitten by a snake!

UP Crime News: రూ.20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం పాముతో స్కెచ్

కేవలం భర్తను చంపడమే కాకుండా, అతని పేరు మీద ఉన్న భారీ ఆర్థిక ప్రయోజనాన్ని కూడా దక్కించుకోవాలని ఆ కిరాతక జంట ప్లాన్ వేసింది. అతుల్ పేరిట ఉన్న రూ.20 లక్షల ఇన్సూరెన్స్ (భీమా) డబ్బులను క్లెయిమ్ చేసి కాజేయాలని పథకం రచించారు. సాధారణంగా చంపితే పోలీసులకు దొరికిపోతామనే భయంతో, సహజ మరణంగా చిత్రీకరించేందుకు గురువారం రాత్రి దామిని తన ప్రియుడు తుషార్‌తో కలిసి బెడ్‌రూమ్‌లోకి ఒక విషపూరితమైన పామును తెచ్చింది. నిద్రిస్తున్న భర్త అతుల్‌ను ఆ పాముతో కాటు వేయించి అత్యంత అమానుషంగా హత్య చేశారు.

విచారణలో తేలిన అసలు నిజం

అతుల్ అకస్మాత్తుగా మరణించడంతో మొదట దానిని పాము కాటు వల్ల జరిగిన ప్రమాదంగా భావించారు. అయితే, ఈ ఘటనపై అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో నిశితంగా విచారణ చేపట్టారు. దామిని, తుషార్ ల కాల్ డేటా, ప్రవర్తనపై నిఘా ఉంచిన పోలీసులకు అసలు నిజం తేటతెల్లమైంది. ఇన్సూరెన్స్ డబ్బులు, వివాహేతర సంబంధం కోసమే ఈ ప్లాన్ చేసినట్లు నిందితులు ఒప్పుకోవడంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.

బాలుడిని చంపి, సగం తిన్న మొసలి ..వీడియో వైరల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha