Gas Godown Inspection: ఉమ్మడి పుల్కల్ మండలంలోని వివిధ గ్రామాలకు గ్యాస్ సరఫరా చేస్తున్న స్మరణ సాయి ఏజెన్సీని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్మరణ సాయి గ్యాస్ ఏజేన్సీపై వినియోగదారులు పిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు గొంగ్లూరులోని గ్యాస్ గోదాంను తనిఖీ చేశారు. ఇప్పటి వరకు 1.275 మంది వినియోగదారులు గ్యాస్ కోసం బుకింగ్ చేసుకోగా, 290 మందికి మాత్రమే సిలిండర్ల అందజేయగా, మరో 52 సిలిండర్లు డెలివరి చేయాల్సి ఉన్నది.
Read Also:Kalvakuntla kavitha: అసమానతలు లేని సమాజమే బాబాసాహెబ్ ఆశయం.. కవిత
Gongloor Bharat Gas Godown Inspection
Gas Godown Inspection: అధికారుల కీలక ఆదేశాలు
మరో 988 బుకింగ్ పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయమై డీసీఎస్ఈ గ్యాస్ కంపెనీ సేల్స్ అధికారితో ఫోన్లో మాట్లాడి వెం టనే సరఫరా చేయాలని కోరారు. గ్యాస్ సిలిండర్లు వచ్చిన వెంట వెంటనే వినియోగదారులకు అందజేయాలని ఆదేశించారు. ఈ నెల 15వ తేదీలోగా 344, 16వ తేదీలోగా 344 సిలిండర్లను పూర్తిగా సరఫరా చేయాలన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా 40 నుండి 50 సిలిండర్లను గోదాంలో ఎప్పుడూ నిల్వలో ఉంచాలన్నారు. గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసిన వినియోగదాయలకు సమయానికి డెలివరీ చేయాలని, పిర్యాదుల రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

