Dailyhunt
పూరీ జగన్నాథ్ కెరీర్ పై విజయ్ సేతుపతి ప్రశంసలు

పూరీ జగన్నాథ్ కెరీర్ పై విజయ్ సేతుపతి ప్రశంసలు

వార్త 1 week ago

Puri Jagannadh: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, డైనమిక్ మేకర్ పూరీ జగన్నాథ్ భారత చలనచిత్ర పరిశ్రమలో 26 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

తనదైన శైలిలో హీరోల క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేస్తూ, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ముద్ర వేసిన పూరీకి ఈ సందర్భంగా ప్రశంసలు లభిస్తున్నాయి.

Read Also: Director Atlee: రెండోసారి తండ్రి అయిన స్టార్ డైరెక్టర్ అట్లీ

 Puri has completed 26 years in the industry.

Puri Jagannadh: విజయ్ సేతుపతి హృదయపూర్వక పోస్ట్

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, సోషల్ మీడియా వేదికగా పూరీకి శుభాకాంక్షలు తెలిపారు. పూరీ జగన్నాథ్‌ను ఒక దర్శకుడిగానే కాకుండా, ఇండస్ట్రీని ప్రభావితం చేసే ఒక గొప్ప శక్తిగా ఆయన అభివర్ణించారు.

“ఈ 26 ఏళ్ల ప్రయాణం కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ఇది ధైర్యం, నమ్మకం, నిర్భయ స్వరంతో నిర్మించిన ఒక గొప్ప లెగసీ. పూరీ గారూ, మీతో కలిసి పనిచేయడం నాకు గొప్ప అనుభవం. నటులను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువచ్చే మీలాంటి దర్శకులు పరిశ్రమకు ఎంతో అవసరం,” అంటూ విజయ్ సేతుపతి ప్రశంసలు కురిపించారు.

'స్లమ్‌డాగ్' సెట్స్‌లో పండుగ వాతావరణం

పూరీ కనెక్ట్స్ పతాకంపై ఛార్మి కౌర్‌తో కలిసి పూరీ జగన్నాథ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు టబు, సంయుక్త, బ్రహ్మాజీ వంటి భారీ తారాగణం నటిస్తోంది. 26 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘స్లమ్‌డాగ్’ చిత్ర యూనిట్ సెట్స్‌లో వేడుకలు నిర్వహించి పూరీకి శుభాకాంక్షలు తెలియజేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హీరో విజయ్ విడాకుల కేసు..వీడియో కాన్ఫరెన్స్‌కు నో చెప్పిన కోర్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha