Director Atlee: కోలీవుడ్ మరియు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) భార్య, ప్రియ పండంటి ఆడబిడ్డ జన్మించింది. 'జవాన్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అట్లీ, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో మరో మధుర క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: Chiranjeevi financial help: రెండు కుటుంబాలకు అండగా నిలిచిన చిరంజీవి
Director Atlee: ప్రముఖుల విషెస్
2026 ఏప్రిల్ 20న తమకు ఆడబిడ్డ జన్మించినట్లు అట్లీ, ఆయన భార్య ప్రియ(Atlee- Priya) అధికారికంగా ప్రకటించారు. దాంతో అక్షయ తృతీయ పర్వదినం నాడు మీ ఇంటికి పండంటి ఆడబిడ్డ వచ్చిందని అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. హీరోయిన్లు కాజల్ అగర్వాల్, సమంత, రష్మిక మందన్న, అనన్య పాండే, నిషా అగర్వాల్ తదితరులు అట్లీ దంపతులకు విషెస్ తెలియజేశారు.
అట్లీ ప్రొఫెషనల్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ , దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో 'రాకా' అనే భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇటీవల అల్లు అర్జున్ 44వ జన్మదినం సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది.గుండు తలతో, రగ్డ్ స్టైల్‌లో ఉన్న అల్లు అర్జున్ ముఖాన్ని తోడేలు పంజా అడ్డంగా కప్పినట్లుగా చూపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
హీరో విజయ్ విడాకుల కేసు..వీడియో కాన్ఫరెన్స్‌కు నో చెప్పిన కోర్టు

