Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుష్ప 2' వర్సెస్ 'భ్రమయుగం'.. రేసులో విక్రమ్, సౌబిన్ షాహిర్!

పుష్ప 2' వర్సెస్ 'భ్రమయుగం'.. రేసులో విక్రమ్, సౌబిన్ షాహిర్!

వార్త 3 weeks ago

72nd National Film Awards: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే '72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల' (National Film Awards) ప్రకటనకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (NFDC) ఆధ్వర్యంలో 2024 సంవత్సరానికి గాను సెన్సార్ పూర్తి చేసుకున్న ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను ఈ అవార్డుల కోసం ఎంపిక చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం శుక్రవారమే ఈ పురస్కారాలను ప్రకటిస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, వచ్చే వారంలోనే ఈ అధికారిక విజేతల జాబితా వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ ఏడాది ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగాల్లో గట్టి పోటీ నెలకొనగా.. అందరి దృష్టి 'ఉత్తమ నటుడు' (Best Actor) కేటగిరీపైనే ఉంది. ఈసారి ఏకంగా నలుగురైదుగురు అగ్ర నటులు తమ విశ్వరూపం చూపించిన చిత్రాలు రేసులో ఉండటంతో జాతీయ జ్యూరీ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Read Also:Bandla Ganesh: బండ్ల గణేష్‌కు చుక్కెదురు.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

రేసులో 'పుష్పరాజ్'.. అల్లు అర్జున్‌కు మరో జాతీయ అవార్డు దక్కేనా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పటికే 'పుష్ప: ది రైజ్' చిత్రానికి గానూ నేషనల్ అవార్డ్ సాధించి హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2) చిత్రంతో ఆయన మరోసారి బెస్ట్ యాక్టర్ రేసులో నిలిచారు. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనబరిచిన మేనరిజమ్స్, యాక్టింగ్ మరియు డైలాగ్ డెలివరీకి సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఈసారి కూడా ఆయనకే అవార్డు ఖాయమని టాలీవుడ్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

72nd National Film Awards: బన్నీకి గట్టి పోటీ ఇస్తున్న సౌత్ మెగాస్టార్స్!

ఈసారి అల్లు అర్జున్‌కు పోటీగా మలయాళ, కోలీవుడ్ పరిశ్రమల నుంచి పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌లు రేసులోకి వచ్చాయి:

  • మమ్ముట్టి (భ్రమయుగం): మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) పీరియడ్ మిస్టరీ హారర్ డ్రామా 'భ్రమయుగం'లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో క్లాసిక్ నటనను ప్రదర్శించారు. కేవలం మూడు పాత్రల చుట్టూ తిరిగే ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో మమ్ముట్టి యాక్టింగ్ గూస్‌బంప్స్ తెప్పించింది. ప్రస్తుతం ఈ కేటగిరీలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
  • చీయాన్ విక్రమ్ (తంగలాన్): వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన కోలీవుడ్ స్టార్ విక్రమ్ (Vikram) 'తంగలాన్' చిత్రం కోసం చేసిన మేకోవర్, పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో ఆయన నటనకు జాతీయ అవార్డు గ్యారెంటీ అనే టాక్ కోలీవుడ్‌లో నడుస్తోంది.
  • సౌబిన్ షాహిర్ (మంజుమ్మల్ బాయ్స్): 2024లో సంచలన విజయం సాధించిన 'మంజుమ్మల్ బాయ్స్' చిత్రంలో అద్భుతమైన భావోద్వేగాలను పండించిన సౌబిన్ షాహిర్ కూడా ఈ సారి ఉత్తమ నటుడి రేసులో డార్క్ హార్స్‌లా నిలిచారు.

సాధారణంగా ప్రతి సంవత్సరం ఇద్దరు లేదా ముగ్గురు నటుల మధ్యే పోటీ ఉండేది, కానీ ఈసారి నలుగురు దిగ్గజాలు సరిసమానమైన నటనతో పోటీ పడుతుండటంతో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జ్యూరీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వచ్చే వారం రానున్న అధికారిక అనౌన్స్‌మెంట్‌తో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.

Epaper: epaper.vaartha.com

ప్రశ్నిస్తే చంపేస్తారా?.. జనసైనికులపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha