Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుష్ప సినిమాలో అవకాశంపై నటుడు సునీల్ సంచలన వ్యాఖ్యలు!

పుష్ప సినిమాలో అవకాశంపై నటుడు సునీల్ సంచలన వ్యాఖ్యలు!

వార్త 3 months ago

Actor Sunil: హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమై.. ఆ తర్వాత హీరోగా, విలన్‌గా వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న నటుడు సునీల్ తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమాలో 'మంగళం శ్రీను' పాత్రకు తను ఎంపికవడం ఒక పెద్ద షాక్ అని ఆయన అన్నారు. ఆ నెగెటివ్ క్యారెక్టర్ తన కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పిందని, ప్రస్తుతం అన్ని భాషల చిత్ర పరిశ్రమల నుంచి వరుస అవకాశాలు తెచ్చిపెడుతోందని సంతోషం వ్యక్తం చేశారు.

 pushpa mangalam srinu character

Read also: Chiranjeevi: చిరంజీవి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం

Actor Sunil: సుకుమార్ విలన్‌గా ఎలా ఊహించుకున్నారంటే..?

సునీల్ కీలక పాత్రలో నటించిన తాజా మలయాళ చిత్రం 'కాటాలన్‌' (Kaathalan). ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రమోషన్ల ఈవెంట్‌లో సునీల్ మాట్లాడారు. 'పుష్ప'లో అంతటి క్రూరమైన విలన్ పాత్రకు దర్శకుడు సుకుమార్ మిమ్మల్ని ఎలా ఎంచుకున్నారని అడగ్గా.. “లాక్‌డౌన్ సమయంలో నేను ఇకపై కేవలం కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన రోల్స్ చేయాలనుకుంటున్నట్లు సుకుమార్‌కు చెప్పాను. ఆ మాట చెప్పిన రెండు రోజులకే ఆయన నాకు ఫోన్ చేశారు. ‘పుష్ప’లో ఒక పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ ఉంది. కానీ ఇందులో అస్సలు కామెడీ చేయకూడదు. శరీరాన్ని ఎక్కువగా కదల్చకుండా కేవలం కళ్లతో, ముఖ కవళికలతోనే భయంకరమైన హావభావాలు పలికించాలి’ అని సుకుమార్ నాతో కండిషన్ పెట్టారు” అని సునీల్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ఆ పాత్ర లుక్ టెస్ట్ కోసం పంపిన దుస్తులను వేసుకుని రకరకాలుగా ఫోటోలు దిగి సుకుమార్‌కు పంపించానని, అవి ఆయనకు బాగా నచ్చడంతో మంగళం శ్రీనుగా చాన్స్ దక్కిందని చెప్పారు. అంతేకాదు, షూటింగ్ జరిగినన్ని రోజులు ఆ గెటప్ కోసం తన నుదుటిపై జుట్టును నిరంతరం షేవ్ చేసుకోవాల్సి వచ్చేదని సునీల్ తెలిపారు.

మే 28న 'కాటాలన్' తెలుగు విడుదల!

సునీల్ ‘మారి’ అనే వైవిధ్యమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్’ చిత్రం మే 28న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏనుగు దంతాల స్మగ్లింగ్ (అక్రమ రవాణా) బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాకు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఈ హై-వోల్టేజ్ చిత్రంలో ఆంటోనీ వర్గీస్, కబీర్ దుహాన్ సింగ్, దుషారా విజయన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

పోలీస్‌గా ప్రభాస్ యాక్షన్ షురూ.. 'స్పిరిట్'పై హైప్ పెరుగుతోంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha