Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాబోయే రెండు రోజులు ఏపీ, తెలంగాణకు వర్షసూచన

రాబోయే రెండు రోజులు ఏపీ, తెలంగాణకు వర్షసూచన

వార్త 2 weeks ago

Rain Alert: భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ (IMD) తీపి కబురు అందించింది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి ఉపశమనం కలిగిస్తూ ఏపీ, తెలంగాణల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.

మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా బుధ, గురువారాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రస్తుతానికి మెజారిటీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతుండటం గమనార్హం.

 weather forecast red and orange alerts issued

హైదరాబాద్‌లో కొనసాగనున్న వర్ష సూచన

మంగళవారం అర్ధరాత్రి భాగ్యనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం కూడా నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

Read also: Hyderabad Rain: హైదరాబాద్‌ లో పలు చోట్ల అర్ధరాత్రి నుంచి భారీ వర్షం

Rain Alert: ఏపీలో భిన్న వాతావరణం.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు భానుడి ప్రతాపం కొనసాగుతుండగానే మరోవైపు ఆకస్మిక వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ప్రమాదం ఉన్నందున పిడుగుల బారిన పడకుండా ఉండేందుకు ఎవరూ చెట్ల కింద, కరెంట్ స్తంభాలు లేదా పాత హోర్డింగ్స్ వద్ద ఆశ్రయం పొందవద్దని సూచించింది. వాతావరణ తీవ్రతను బట్టి రాష్ట్రంలోని 6 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలు: విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తిరుపతి, చిత్తూరు. మోస్తరు వానలు కురిసిన ప్రాంతాలు: కాకినాడ, అనకాపల్లి, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, మార్కాపురం.

గంటకు 60 కిమీ వేగంతో గాలులు.. మరోవైపు వేడిగాలుల సెగ!

వర్షం పడే సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే వానలు పడుతున్నప్పటికీ ఎండల తీవ్రత పూర్తిగా తగ్గలేదు. బుధవారం ఏపీలోని 68 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు (Severe Heatwaves), మరో 93 మండలాల్లో సాధారణ వేడిగాలులు వీచే అవకాశముంది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, కోనసీమ, ఏలూరు, కృష్ణా, బాపట్ల, అనకాపల్లి జిల్లాల ప్రజలు తీవ్రమైన ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

మెగా డీఎస్సీ దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. ఏపీ విద్యాశాఖ ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha