Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాధాగాయత్రి కేసులో సంచలనం.. శ్రీచరణ్‌కు మరొకరు సహకరించారు.. తండ్రి ఆరోపణ!

రాధాగాయత్రి కేసులో సంచలనం.. శ్రీచరణ్‌కు మరొకరు సహకరించారు.. తండ్రి ఆరోపణ!

వార్త 1 month ago

Radha Gayatri Death Case: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని (టెకీ) రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో తమ కుమార్తెకు న్యాయం జరగాలంటూ ఆమె తల్లిదండ్రులు ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మసూరి కలెక్టర్ ఈ కేసుపై పూర్తిస్థాయి న్యాయవిచారణకు ఆదేశించడంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా రాధాగాయత్రి తండ్రి సుధాకర్ ఈ ఘటనపై విస్తుపోయే నిజాలను వెల్లడిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

Read Also : Ghatkesar Suicide Case: ఘట్‌కేసర్ దంపతుల ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు.. రూ. 20 లక్షల మోసం!

 Sensational turn in the Radha-Gayatri case: Father alleges another person assisted Sri Charan.

Radha Gayatri Death Case: పథకం ప్రకారమే హత్య.. మరో వ్యక్తి ప్రమేయంపై అనుమానాలు!

రాధాగాయత్రి తండ్రి సుధాకర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తన కుమార్తెది సాధారణ మరణం కాదని, అది ముమ్మాటికీ హత్యేనని స్పష్టం చేశారు. అల్లుడు శ్రీచరణ్ పక్కా ప్రణాళిక ప్రకారమే రాధాగాయత్రిని దారుణంగా హతమార్చాడని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఈ ఘోరానికి ఒడిగట్టిన రోజు సంఘటనా స్థలంలో శ్రీచరణ్ ఒక్కడే లేడని.. ఈ దారుణ హత్యలో అతనికి సహాయం చేయడానికి మరో గుర్తు తెలియని వ్యక్తి సహకరించాడని సుధాకర్ పేర్కొన్నారు.

ఈ కుట్రలో పాల్గొన్న ఆ రెండో వ్యక్తి ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆదేశించిన న్యాయవిచారణ ద్వారా అయినా తమ కుమార్తె మరణం వెనుక ఉన్న అసలు నిజా నిజాలు, దోషుల వివరాలు బయటకు వస్తాయని, తమకు న్యాయం జరుగుతుందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సైతం ఈ కేసులో లభించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు.

యూట్యూబర్ 'రావణ్' ఫోన్ డేటాలో షాకింగ్ నిజాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha