Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాగల ఐదు రోజులు ఏపీకి భారీ వర్ష సూచన

రాగల ఐదు రోజులు ఏపీకి భారీ వర్ష సూచన

వార్త 2 weeks ago

AP Heavy Rains:పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాబోయే నాలుగు ఐదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు.

ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Read also: SIR : ఓట్ల తొలగింపు లిస్టును పార్టీలకు ఇవ్వాలి - పేర్ని నాని

 Heavy rain forecast for AP over the next five days.

పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో వర్షాలు

ఉత్తరాంధ్ర, కోనసీమ, తూర్పు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలలో నేడు ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మిగిలిన జిల్లాలలో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది.

AP Heavy Rains:వాతావరణ శాఖ హెచ్చరికలు మరియు సూచనలు

వర్షాల సమయంలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి అని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిదని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు అలాగే ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు.

Epaper: epaper.vaartha.com

VROల సర్వీస్ రూల్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha