Rahul Gandhi Birthday: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఏఐసీసీ (AICC) పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున బర్త్‌డే వేడుకలు, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రాహుల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా రాహుల్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Rahul Gandhi’s birthday special given by CM Revanth Reddy
Rahul Gandhi Birthday: మనకు ఎప్పటికీ ఆయనే స్ఫూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ బర్త్‌డేను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాన్ని పంచుకున్నారు. “మనకు ఎప్పటికీ స్ఫూర్తిదాయక నాయకుడైన రాహుల్ గాంధీ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడటం, సామాజిక న్యాయం అందించడం, ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపిస్తున్న అచంచలమైన నిబద్ధత కోట్లాది మందికి నిరంతరం కొండంత స్ఫూర్తినిస్తోంది” అని రేవంత్ రెడ్డి కొనియాడారు.
రాహుల్ గాంధీ దేశానికి చేస్తున్న సేవలను రేవంత్ రెడ్డి తన సందేశంలో గుర్తుచేసుకున్నారు. “ఆయన దేశానికి, దేశ ప్రజలకు ఇలాగే తన నిరంతర సేవలను కొనసాగించాలి. రాహుల్ గాంధీ గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంతో, మరింత శక్తితో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను” అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘గాంధీ భవన్’ సహా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేకులు కట్ చేసి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా.. పలు ప్రాంతాల్లో పేదలకు అన్నదానాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి వైవిధ్యభరితమైన సేవా కార్యక్రమాలతో కాంగ్రెస్ శ్రేణులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

