Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్‌ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

రాహుల్‌ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

వార్త 2 weeks ago

Rahul Gandhi Birthday: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ప్రధాని ఆకాంక్షించారు.

రాజకీయంగా ఇరు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు, విమర్శలు ఉన్నప్పటికీ.. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయ వర్గాల్లో విశేషంగా నిలిచింది.

శుక్రవారం రాహుల్ గాంధీ 56వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌' (ట్విట్టర్)లో ఒక ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు. ''లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను'' అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.

Read Also: Nara Lokesh: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్

 Prime Minister Modi wishes Rahul Gandhi on his birthday

Rahul Gandhi Birthday: లోక్‌సభ ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు

1970 జూన్ 19న జన్మించిన రాహుల్ గాంధీ.. దేశ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దంపతుల కుమారుడు. ఆయన 2004లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికై తన ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన యూపీలోని కీలకమైన రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రతిపక్షాన్ని ముందుండి నడిపిస్తూ దేశ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సింధూ జలాలపై భారత్ కీలక ప్రకటన.. !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha