Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్ ప్రధాని, రేవంత్ మళ్లీ సీఎం అవుతారు: కడియం శ్రీహరి

రాహుల్ ప్రధాని, రేవంత్ మళ్లీ సీఎం అవుతారు: కడియం శ్రీహరి

వార్త 2 weeks ago

Kadiyam Srihari: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు తెలంగాణవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

Read also: Gandhi Sarovar project: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

రాబోయేది కాంగ్రెస్ కాలమే.. కేంద్రంలో రాహుల్, రాష్ట్రంలో రేవంత్!

ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. భవిష్యత్తులో దేశ ప్రధాని పీఠాన్ని రాహుల్ గాంధీ అధిష్టించడం, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం వంద శాతం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ శ్రేణులంతా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సైనికుల్లా కదిలి, పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Kadiyam Srihari: కేసీఆర్ తరహాలోనే మోదీకి పరాభవం తప్పదు

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “తెలంగాణలో మాకు తిరుగులేదు, ఎదురే లేదు అనే అహంకార ధోరణితో వ్యవహరించిన కేసీఆర్‌కు ఇక్కడి ప్రజలు ఎలాంటి తీర్పుతో గుణపాఠం చెప్పారో మనం చూశాం. రానున్న రోజుల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా దేశ ప్రజలు అదే రీతిలో బుద్ధి చెప్పడం ఖాయం” అని ఆయన జోస్యం చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను రాహుల్ గాంధీ ఒక్కరే ధైర్యంగా ఎండగడుతున్నారని కొనియాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో దేశంలో రాజ్యాంగ రక్షణ కోసం, అణగారిన, పీడిత వర్గాల హక్కుల కోసం పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ నిరంతరం గళం విప్పుతున్నారని కడియం శ్రీహరి ప్రశంసించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యం: మహేశ్ గౌడ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha