Dailyhunt
రాజధాని చట్టభద్రత ఇక చిరస్థాయి.. మంత్రి లోకేష్

రాజధాని చట్టభద్రత ఇక చిరస్థాయి.. మంత్రి లోకేష్

వార్త 2 weeks ago

ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ ప్రత్యేక శ్రద్ధవల్లే అమరావతి పాస్.. మంత్రి లోకేష్

Amaravati Bill Parliament: అమరావతికి చట్టభద్రత లభించిన రోజు చరిత్రలో చిర స్థాయిగా నిలబడుతుందని రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు. అమరావతి రైతులు గెలిచిన రోజు. అమరావతి మహిళలు గెలిచిన రోజు అని స్పష్టం చేసారు. మంత్రి లోకేష్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత మనందరం మద్రాసు రాజధానిగా మద్రాసు స్టేట్ లో ఉన్నామని, దాని తర్వాత పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల దీక్ష, ప్రాణత్యాగం వల్ల భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు.

అందులో భాగంగా కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. మూడేళ్ల తర్వాత ఒక ఒప్పందం వల్ల మళ్లీ తెలంగాణ, ఆంధ్ర కలిపి హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పాటైందని అన్నారు. 58 సంవత్సరాలు కష్టపడి, చెమటోడ్చి అటు తెలంగాణా, ఇటు ఆంధ్రప్రజలు కలసికట్టుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్నామని, ఒక చీకటిరోజు పార్లమెం టులో ఎలాంటి చర్చ జరగకుండా టీవీలు కట్టేసి, తలుపులు మూసేసి ఆంధ్రరాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని విమర్శించారు.

Read Also: Anantapur: అనంతపురంలో ఆర్. శ్రీనివాసులకు ఘన సన్మానం

 Amaravati Clears Hurdle Thanks to the Special Attention of PM Modi and Union Home Minister Amit.. Minister Lokesh

Amaravati Bill Parliament: ప్రధాని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు

ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీమ్ 11 అనేక దుష్ప్రచారాలు చేసిందని, ఇప్పుడు కూడా చేస్తు న్నారని లోకేశ్ వాపోయారు. మళ్లీ పొరపాటున అధికారంలోకి వస్తే 3 రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా చెబుతున్నారని ధ్వజమెత్తారు. వారి తప్పుడు ప్రచారం ఆంధ్రరాష్ట్రానికి, అమ రావతికి రావాల్సిన పెట్టుబడులు నెమ్మ దించాయని అన్నారు. ఇప్పటికే చాలా నష్ట పోయాం, మా భవిష్యత్తు ఏమిటని రైతుల్లో కూడా ఆందోళన వచ్చిందన్నారు. ఆం ధ్రప్రెదేశకు అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధత ఉండాలని రైతులంతా కోరారని, అందులో భాగంగా సభలో రోజంతా దీనిపై చర్చించినట్లు తెలిపారు. అమరావతే శాశ్వత రాజధానిగా ఉండాలని ఏక్రగీవంగా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారుని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పార్ల మెంటులో బిల్లుపాస్ చేయించేందుకు చొరవచూపారని వెల్లడించారు.

యావత్ భారతదేశం అండగా నిలబడింది

ఒకే ఒక్క పార్టీ తప్ప మొత్తం భారతదేశం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడిందని అన్నారు. చాలామంది ఈరోజు రాజ్యసభలో మాట్లాడారని తెలిపారు. ‘అమరావతికి మద్దతివ్వడం ప్రారంభం మాత్రమే, అంతా ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలబడాలని, ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అయిదేళ్లు చాలా నష్టపోయింది. టీమ్ 11 పార్టీ మినహా మేమంతా అండగా ఉంటామని అన్నిపార్టీలు కలసికట్టుగా మద్దతునిచ్చాయి. బీజేపీ, జనసేన, జేడీయు, అటుపక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాది పార్టీ ఇలా అందరూ ముక్తకంఠంతో ఏపీ శాశ్వత రాజధాని అమరావతి అని మాట్లాడారు. ఈరోజు కూడా రాజ్యసభలో కరెక్టుగా 11 పార్టీలు మాట్లాడాయి.

గత పాలకులు చేసిన పొరపాట్లకుగాను 11 నెంబర్ వారిని వెంటాడుతోంది. ఒకపార్టీ మాత్రం వాకౌట్ చేసింది. అది ప్యాషనో, మరేమిటో సీసీడీ (క్రెడిట్ చోరీ డిజార్డర్) ఉన్న వ్యక్తిని మీరంతా అడగాలి. మొత్తం భారతదేశం ఈరోజు ఆంధ్రులకు అండగా నిలబడింది. ఇందుకు రాష్ట్రప్రజలంతా గర్వపడాలి. మాపై ఉంచి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. తప్పనిసరిగా అమరావతి పనులు పూర్తిచేస్తాం. ప్రధానిమంత్రి మోడీజీని తీసుకెళ్లి నూతన రాజధానికి రిబ్బన్ కటింగ్ చేయించే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడేవిధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. రాజధానితోపాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం అని లోకేశ్ వివరించారు అశాస్త్రీయ రాష్ట్ర విభజన దారుణం.

విభజన ఎంత దారుణంగా జరిగిందంటే షెడ్యూల్ 9, 10 సంస్థలు ఇప్పటికీ అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్రానివో తేలని దుస్థితి నెలకొందని అన్నారు. అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల ఇప్పుడు కూడా తెలుగు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆనాడు హైదరాబాద్ లో గల శాసనసభలో ఏపీ అసెంబ్లీ సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా స్పష్టంగా అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు సమ దూరంలో రాజధాని ఉండాలని చెప్పారని గుర్తు చేశారు. ఆ రాజధాని అమరావతి అని ఆనాడు ప్రకటించారని అన్నారు. ७ సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని చెప్పారని, అందులో భాగంగా రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చారని అన్నారు. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని అన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Srikakulam Badam Milk Incident: బాదం పాలు తాగి 80 మందికి అస్వస్థత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha